Ysrcp : మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్ద‌రు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్ద‌రు…?

 Authored By kondalrao | The Telugu News | Updated on :13 June 2021,11:22 am

Ysrcp : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చారంటే ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం వారికీ పండగే పండగ. సీబీఐ కేసుల మాఫీ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు అపొజిషన్ పార్టీకి మంచి ఛాన్స్ దొరుకుతుంది. అదే సమయంలో తమకు కేంద్ర మంత్రులుగా ప్రమోషన్లు వస్తాయనే ప్రచారం రూలింగ్ పార్టీ వాళ్లకు ఆనందం పంచుతుంది. ఈ హడావుడి రెండు మూడు రోజుల పాటు నెలకొంటుంది. ఆ తర్వాత అంతా మామూలైపోతుంది. సైలెంటుగా ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న, నిన్న హస్తినలో పర్యటించి తాడేపల్లిగూడేనికి చేరుకున్నారు. దీంతో ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ఊహిస్తూ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వంలో చేరిక..

వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోతోందని, ఆ పార్టీ ఎంపీలు ముగ్గురు సెంట్రల్ మినిస్టర్లు కాబోతున్నారని చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరి పేర్లను కూడా వెల్లడిస్తున్నారు. సీనియర్ లీడర్ విజయసాయిరెడ్డి, జూనియర్ లీడర్ డాక్టర్ గురుమూర్తి అని అంటున్నారు. డాక్టర్ గురుమూర్తి లేటెస్టుగా తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుందంటే ఆశ్చర్యపోవాల్సినదేమీ లేదు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీలో నంబర్ 2 అనే విషయం విధితమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టకముందు నుంచి కూడా విజయసాయిరెడ్డికి, వైఎస్ కుటుంబానికి మధ్య చాలా కాలంగా పరిచయాలు, ప్రత్యేక అనుబంధాలు, ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి విజయసాయిరెడ్డికి ప్రమోషన్ అనేది పెద్దగా ఆసక్తి కలిగించే అంశం కాదు.

ysrcp will join in modi cabinet

ysrcp will join in modi cabinet

మస్తు లక్కు ‘‘గురూ’’.. : Ysrcp

కొత్త ఎంపీ డాక్టర్ గురుమూర్తికి గనక కేంద్ర మంత్రి పదవి వస్తే వైఎస్సార్సీపీలో అతనికి మించిన లక్కీ ఫెలో మరొకరు ఉండరని చెప్పొచ్చు. ఎందుకంటే డాక్టర్ గురుమూర్తికి పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అసలు అతనికి ఎంపీ టికెట్ లభించటమే విశేషం. అలాంటిది ఇప్పుడు ఏకంగా సెంట్రల్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఫిజియోథెరపిస్టుగా డాక్టర్ గురుమూర్తి వైద్యసేవలందించారట. వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించటంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావటంలో ఆ పాదయాత్ర పాత్ర గొప్పది. కాబట్టి ఆ ఫీలింగ్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గురుమూర్తికి ఎంపీ ఛాన్స్ ఇచ్చారని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటుంటాయి. ఇదిలా ఉండగా మోడీ మంత్రివర్గంలో ఈ రెండు పదవులతోపాటు మరో సహాయ మంత్రి పోస్ట్ (ఇండిపెండెంట్ ఛార్జ్) కూడా ఇస్తారని, దాన్ని ఉత్తరాంధ్ర లేదా తూర్పు గోదావరి జిల్లాలోని ఎంపీని వరించబోతోందని వినికిడి. నిజమేంటో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆ పైవాడికే తెలియాలి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : బై ఎల‌క్ష‌న్స్ బీ రెడీ.. అంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : బై ఎల‌క్ష‌న్స్ బీ రెడీ.. అంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..?

ఇది కూడా చ‌ద‌వండి ==>  YSRCP : అక్కడ వైసీపీకి ఎదురే లేదు.. కానీ ఎమ్మెల్యే…?

ఇది కూడా చ‌ద‌వండి ==> TTD CHAIRMAN : వైవీకి ప్ర‌మోష‌న్‌.. టీటీడీ కొత్త చెర్మన్ గా ఎవరు…?

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది