Chandrababu : చంద్రబాబు చేసింది యాజ్ ఇట్ ఈజ్ జగన్ చేస్తే ఏం జరుగుతుంది?
Chandrababu : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ కూడా ఎన్నికల కోసం రెడీ అవుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ప్రకటించేశారు చంద్రబాబు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు టికెట్లు ఇవ్వడం వరకు ఓకే కానీ.. ఒకవేళ మిత్రపక్షంతో పొత్తు కావాలని అనుకునే చంద్రబాబు.. తను వేరే పార్టీతో కలిసి వెళ్తే అప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ టికెట్లలో కొన్నింటిని కోరితే అప్పుడు పరిస్థితి ఏంటి?
కొన్ని స్పెసిఫిక్ సీట్లు కావాలని మిత్రపక్షం కోరుకుంటే అప్పటికప్పుడు చంద్రబాబు టికెట్లను వాళ్లకు కేటాయిస్తారా? ఉదాహరణకు వైజాగ్ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్స్ అందరికీ టికెట్ ఖాయం అని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో గంటాకు కూడా టికెట్ కన్ఫమ్ అనే అనుకోవాలి. అయితే.. భవిష్యత్తులో బీజేపీ లేదా జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అప్పుడు వైజాగ్ నార్త్ టికెట్ ను టీడీపీ వదులుకోవాలి. బీజేపీకే ఆ టికెట్ ఇచ్చేయాల్సి ఉంటుంది.
Chandrababu : గంటాను భీమిలీ పంపిస్తారా?
ఒకవేళ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే వైజాగ్ నార్త్ టికెట్ ను బీజేపీకే కేటాయించాల్సి వస్తుంది. 2014 లో అక్కడ బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గెలిచారు. కాబట్టి.. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపుతుంది. అందుకే బీజేపీతో పొత్తు కుదిరితే గంటాకు చంద్రబాబు భీమిలీ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంటుంది. మరోవైపు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కూడా అంతే. టీడీపీ నుంచి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఈ సీటును కూడా బీజేపీ ఆశిస్తుంది కాబట్టి ఆమెకు ఇవ్వకుండా చంద్రబాబు.. బీజేపీకే ఇచ్చేస్తారా? రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా అంతే. అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి 2014, 2019 రెండు ఎన్నికల్లో గెలిచారు. ఇక్కడ జనసేన బలంగా ఉండటంతో జనసేన టికెట్ కోరితే.. చంద్రబాబు ఈ సీటును కూడా వదులుకోవాల్సి ఉంటుంది. పెద్దాపురం నియోజకవర్గం కూడా అంతే. నిమ్మకాయల చినరాజప్ప అక్కడ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలోనూ జనసేన స్ట్రాంగ్ గా ఉంది. దీంతో ఇక్కడ కూడా జనసేన టికెట్ కోరే అవకాశం ఉంది. మొత్తం మీద సిట్టింగ్ లలో ఆ నాలుగు టికెట్ల విషయంలో మాత్రం మిత్రపక్షం కోరితే సీట్లను చంద్రబాబు వదులుకోవాల్సిందే.