Jr Ntr : బాబుకి షాక్.. టీడీపీ ఆర్భావ సభలో సీనియర్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన..!
Jr Ntr : తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేష్ లో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో బూతద్దం పెట్టి వెదికినా కనిపించే పరిస్థితి లేదు. ఇదే సమయంలో ఏపీలో కూడా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీని మళ్లీ అధికారం వైపుకు తీసుకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో రకాలుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించాలి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలపై ఆసక్తి లేదు. అయినా కూడా ఆయన్ను రావాల్సిందే అంటే ఎలా అని కొందరు తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నా కూడా కొందరు మాత్రం ఆయన్ను తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
తాజాగా తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ సభలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండగానే కొందరు నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ను నెత్తికి ఎక్కించుకున్నంత పని చేసి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుడు అయిన బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఈ సమయంలో తెలుగు దేశం పార్టీని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అందులో ఎన్టీఆర్ కూడా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్ అనే పేరు వినిపించగానే నాయకులు గట్టిగా అరిచి తమ మద్దతును మరియు డిమాండ్ ను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పకనే చెప్పడం జరిగింది.
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ రావాలి : టీడీపీ నాయకులు
టీడీపీ నాయకులు ఎన్టీఆర్ ను ఏ స్థాయిలో కోరుకుంటున్నారో ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు అర్థం అయ్యింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఇలాంటి డిమాండ్ వినిపించడం వింతగా ఉందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు క్రమశిక్షణ కలిగిన వారిగా గతంలో పేరు ఉంది. కాని ఇప్పుడు మాత్రం పదే పదే అధినేతను ఇబ్బంది పెట్టేలా ఎన్టీఆర్ పేరును ప్రస్థావిస్తున్న కారణంగా వారి పార్టీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధినేత చంద్రబాబు నాయుడు మొహం మాడిపోయినా వాడిపోయినా కూడా ఎన్టీఆర్ అనే మాటను మాత్రం తెలుగు తమ్ముళ్లు వదలడం లేదు. ఏదో ఒక రోజున తెలుగు దేశం పార్టీ జెండాను బుజాన పెట్టుకోవాల్సింది ఎన్టీఆర్ అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.