Nara Lokesh : కుప్పంలో టీడీపీపీ ఏం చేయ‌లేదు.. కార్య‌క‌ర్త మాట‌ల‌తో ఖంగుతిన్న నారా లోకేష్‌

Advertisement

Nara Lokesh : నారా లోకేశ్ తో ముఖాముఖిలో టీడీపీ కార్యకర్త భానుమూర్తి టీడీపీ అధికారంలో ఉన్నప్పడు బీసీలకు చేసిన అన్యాయంపై మాట్లాడారు. ఓ నిఖార్సైన కార్యకర్తగా చెప్పాలంటే టీడీపీ నుంచి ఎవరూ మా సామాజికవర్గం (వన్నెకుల క్షత్రియ–బీసీ) సంక్షేమానికి కృషి చేయలేదని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇప్పించేందుకు ఏ నాయకుడూ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

TDP Nara lokesh about women corporation chairman vanitha
TDP Nara lokesh about women corporation chairman vanitha

కుప్పంపై అగ్రనేతలు ఇచ్చిన ఎలాంటి నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని లోకేశ్ ను భాముమూర్తి అభ్యర్థించాడు. కుప్పంలో అంతా ఓకే అని మన నాయకులు చెబుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా భిన్నంగా ఉందని వివరించారు. వెంటనే అప్రమత్తమైన లోకేశ్ అలా మాట్లాడటం సరికాదని నిలువరించారు.

Advertisement
Nara Lokesh New Story, TDP Cadre In Huge Shock
TDP Nara lokesh about women corporation chairman vanitha

Nara Lokesh : నివ్వెరబోయిన నారా లోకేశ్.. కార్యకర్తపై మండిపాటు

అసలు గ్రౌండ్ రిపోర్టు మాకు తెలియదని మీరు ఎలా చెబుతారని సదరు కార్యకర్తపై మండిపడ్డారు. దీనిపై మరింత విసుగు చెందిన నారా లోకేశ్.. వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ వనితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వనిత ఇంతవరకు ఏమి పీకారని కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన కాసేపు ఆ సభలో అలజడి సృష్టించింది.

Advertisement
Advertisement