Chintamaneni Prabhakar : దెందులూరులో మళ్లీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గెలుస్తారా..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chintamaneni Prabhakar : దెందులూరులో మళ్లీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గెలుస్తారా..??

Chintamaneni Prabhakar : తెలుగుదేశంలో చింతమనేని ప్రభాకర్ అంటే మాస్ లీడర్. దెందులూరు లో వరుసగా గెలిచి వస్తూ ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్ గాడిలో ఓడిపోయారు. ఆ ఓటమిని ఇప్పటికీ ఆయన ఒప్పుకోరు. తనపై ఎన్ని కేసులు పడిన తనదైన శైలిలో రాజకీయం చేస్తూనే ఉంటారు. ఏలూరు జిల్లాలో హాట్ కేక్ లాంటి ఈ సీట్లో ఈసారి రాజకీయం మరింత కాక రేపుతుంది. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దెందులూరు ఎక్కువగా వార్తల్లో ఉండేది. వివాదాలు, విమర్శలుమ […]

 Authored By anusha | The Telugu News | Updated on :27 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chintamaneni Prabhakar : దెందులూరులో మళ్లీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గెలుస్తారా..??

Chintamaneni Prabhakar : తెలుగుదేశంలో చింతమనేని ప్రభాకర్ అంటే మాస్ లీడర్. దెందులూరు లో వరుసగా గెలిచి వస్తూ ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్ గాడిలో ఓడిపోయారు. ఆ ఓటమిని ఇప్పటికీ ఆయన ఒప్పుకోరు. తనపై ఎన్ని కేసులు పడిన తనదైన శైలిలో రాజకీయం చేస్తూనే ఉంటారు. ఏలూరు జిల్లాలో హాట్ కేక్ లాంటి ఈ సీట్లో ఈసారి రాజకీయం మరింత కాక రేపుతుంది. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దెందులూరు ఎక్కువగా వార్తల్లో ఉండేది. వివాదాలు, విమర్శలుమ ఆరోపణలు, సవాళ్లతో ఫుల్ హీట్ మీద ఉండేది. ఇప్పటికీ అదే వాతావరణం ఉన్న దెందులూరు రాజకీయంగా కాస్త టెంపరేచర్ తగ్గింది. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే అదే స్థాయిలో తిప్పికొడుతు ఉన్నారు వైసీపీ నేతలు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దెందులూరు రాజకీయం మళ్ళీ వేడెక్కుతుంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతుంటారు.

ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కమ్మ కమ్యూనిటీకి కేరాఫ్ అడ్రస్ దెందులూరు అని చెప్పవచ్చు. ఏలూరు పట్టణానికి నలువైపుల వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అవి దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్. మొత్తం రెండు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఇక్కడ కమ్మ వాళ్ళ ఓటు బ్యాంక్ తక్కువగానే ఉంది. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఎక్కువ. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ ఏరియా తెలుగుదేశంగా చింతలనేని మార్చారు. 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ కొటారు అబ్బాయ్య చౌదరి పై చింతమనేని ఓటమి పాలయ్యారు.

కొటారు రామచంద్ర రావు వారసుడిగా విదేశాల్లో స్థిరపడిన అబ్బయ్య చౌదరిని పిలిపించి దెందులూరు నియోజకవర్గంలో గెలిపించారు. అంతేకాకుండా అతడు సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడం కాస్త కలిసి వచ్చింది. నియోజకవర్గ ప్రజలతో పాటు యువతను కూడా ఆకట్టుకొని దూకుడు మీద ఉన్న చింతమనేని కి కళ్లెం వేశారని చెప్పవచ్చు. కొటారు అబ్బయ్యకు 95 వేల ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి చింతమనేనికి 75 వేల ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్ళీ టికెట్ దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసే అభ్యర్థి చింతమనేని అని భావిస్తున్నారు. దాంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి టిీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోటీ ఉంటుందని టాక్ నడుస్తుంది. చింతమనేనికి జనంలో మంచి పేరు ఉంది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది