TDP విశాఖ జిల్లాలో భీమిలీ నియోజకవర్గం తెలుగుదేశానికి TDP కంచుకోట. ఇక్కడ చివరి నిముషంలో టికెట్ తెచ్చుకున్నా కూడా అవతల పార్టీ అభ్యర్ధికి మూడు చెరువుల నీళ్ళు తాగించే సామర్ధ్యం టీడీపీ TDP అభ్యర్ధికి ఉంటుంది. దానికి అచ్చమైన ఉదాహరణ మాజీ ఎంపీ సబ్బం హరి. 2019 ఎన్నికల్లో ఆయన లాస్ట్ మినిట్ లో భీమిలీ నుంచి పోటీ చేసినా కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. అది కూడా వైసీపీకి ఎంతో ఊపు ఉన్న పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ కి సొంత బలం ఉన్నచోట అన్ని ఓట్లు వచ్చాయి. అలాంటి భీమిలీలో హరి మరణం తరువాత ఇంచార్జి లేకుండా పోయారు. ఇపుడు మాజీ ఎంపీపీని తెచ్చి ఇంచార్జిని చేశారు. భీమిలీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆ సామాజిక వర్గం నుంచే వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. దాంతో టీడీపీ TDP కూడా మరోసారి ఆ వర్గానికే పెద్ద పీట వేసింది.
సబ్బం హరి వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఇపుడు అవంతి శ్రీనివాసరావుకు ధీటైన కాపు నేతను టీడీపీ ఎంపిక చేసింది. గతంలో టీడీపీలో ఉంటూ ఎంపీపీగా గెలిచిన కోరాడ రాజబాబు ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరిన కోరాడ రాజబాబు టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి తిరిగి వెళ్లిపోయారు. ఇన్నాళ్ళకు రాజబాబుకు అవకాశం వచ్చిందని క్యాడర్ ఆనందిస్తున్నారు. అయితే భీమిలీ సీటు మీద చాలా మంది కన్ను ఉంది. రాజబాబుని ఇంచార్జిగా నియమించినా భవిష్యత్తుల్లో మార్పుచేర్పులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. మత్స్య కారుల కోటాలో తనకు సీటు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గంటా నూకరాజు కోరుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ కూడా భీమిలీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2024 నాటికి టీడీపీ TDP లో చురుకుగా ఉంటే గంటా శ్రీనివాసరావుకే టికెట్ అన్న మాట కూడా వినిపిస్తోంది. వీరందరి కంటే కూడా బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా ఇదే సీటు మీద కన్నేశారని టాక్ నడుస్తోంది. భీమిలీలో వైసీపీ మరోసారి గెలవాలి అంటే కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ TDP అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో గెలిచారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎనిమిది డివిజన్లలో 5 టీడీపీ పరం అయ్యాయి. నాయకులతో పని లేకుండా బలమైన క్యాడర్ ఇక్కడ టీడీపీకి ఉంది. దాంతో ఎన్నికల నాటికి అనుకూల గాలి వీస్తే భీమిలీలో మరోమారు సైకిల్ జోరుగా సాగడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా అవంతి ఇప్పటినుంచే తన నియోజకవర్గం మీద ఒక కన్ను వేసి ఉండకపోతే మాత్రం చేజేతులా సీటు కోల్పోవలసి ఉంటుందని కూడా అంటున్నారు.
ఇది కూడా చదవండి ==> ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?
ఇది కూడా చదవండి ==> కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?
ఇది కూడా చదవండి ==> కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?
ఇది కూడా చదవండి ==> వంగవీటి ఇప్పటికైనా కుదురుకునేనా..?
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.