Telangana : లాక్ డౌన్ మరో 10 రోజులు… కేబినెట్‌లో ప‌లు కీలక నిర్ణ‌యాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : లాక్ డౌన్ మరో 10 రోజులు… కేబినెట్‌లో ప‌లు కీలక నిర్ణ‌యాలు..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :8 June 2021,9:15 pm

Telangana : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరో 10 రోజులు పొడిగిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ఆంక్షలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఈ మీటింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మంగళవారం సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు ఆరు గంటలకు పైగా నడిచింది. దీంతో ఆ భేటీ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా, అప్డేట్స్ ఏమేముంటాయా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలపై చర్చించే అవకాశం ఉందని ముందు నుంచీ చెబుతున్నారు.

అందులో ఒకటి.. లాక్ డౌన్. రెండు.. పీఆర్సీ అమలు. కరోనా పాజిటివ్ కేసులు బాగా తగ్గటంతో జనసంచారానికి సంబంధించిన సడలింపును పొడిగించే ఛాన్స్ ఉందని రెండు మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తుండగా దాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పెంచనున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన వేతనాలను ఎప్పటి నుంచి ఇవ్వనున్నారనే దానిపైనా నిర్ణయం తీసుకుంటారని భావించారు. వీటికి తోడు వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే డయాగ్నాస్టిక్ కేంద్రాల ప్రారంభ తేదీనీ ఖరారు చేయనున్నారని అన్నారు.

telangana cabinet meeting Updates

telangana cabinet meeting Updates

వ్యాక్సిన్లపైనా..: Telangana

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్లను తామే ఉచితంగా వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో టీకాల పంపిణీపైనా సమీక్ష నిర్వహించనున్నారని ఆశించారు. మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపే సూచనలు ఉన్నాయని తెలిపారు. లాక్డౌన్ వల్ల రాష్ట్ర సర్కారు ఆదాయం భారీగా పడిపోవటంతో ఆ లోటు భర్తీకి ప్రభుత్వ భూములను విక్రయించాలని గవర్నమెంట్ అనుకుంది. దీనికీ కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు సాయం, ఖరీఫ్ సాగు దిశగా చేపట్టాల్సిన చర్యలు, ఇతరత్రా అంశాలపై లోతుగా చర్చించనున్నట్లు అంచనా వేశారు.

ఈ ప్రాంతాలకు వర్తించదు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండు గురువారం నుంచి లాక్ డౌన్ సడలింపులను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించనుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి వరకే జనసంచారానికి అనుమతిస్తారు. అక్కడ కొవిడ్ వ్యాప్తి కంట్రోల్ కాకపోవటంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పాటిస్తున్న లాక్ డౌన్ రూల్స్ నే మరో 10 రోజుల పాటు కంటిన్యూ చేయనున్నారు.

 

ఇది కూడా చ‌ద‌వండి ==> కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి… రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ట్విట్‌…!

ఇది కూడా చ‌ద‌వండి ==> Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. అందుకే వైఎస్సార్సీపీ సైలెంట్ గా ఉంటోందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎంతో ఫాస్ట్‌గా అత‌ని ప్రేమ‌లో ప‌డిపోయా.. కొత్త ల‌వ‌ర్‌ను ప‌రిచ‌యం చేసిన ర‌ష్మిక..!

 

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది