కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ మంత్రి జగదీష్ రెడ్డి… రేవంత్‌రెడ్డి సంచలన ట్విట్…!
Revanth reddy ఈటెల రాజేందర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మంత్రిపై టార్గెట్ చేసాడని ఓ ప్రముఖ దిపపత్రిక ( డక్కన్ క్రానికల్ ) వార్త కథనం ప్రచురించింది. నల్గొండ మంత్రి జగదీష్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తన ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎం కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ మంత్రి జగదీశ్‌రెడ్డి అని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను రేవంత్‌రెడ్డి ట్విట్‌చేశారు. అయితే ఇప్పడు ఆ ట్విట్ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.
రేవంత్‌రెడ్డి : జగదీశ్‌రెడ్డి ఘంటా కొట్టినేట్టేనా..?
రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా జగదీశ్‌రెడ్డి ‘రస’ కందాయంలో హంపీ ‘థూమ్ ధామ్’.. కోవర్ట్ క్రాంతి కిరణాలతో కాకవికలం.. జగదీశ్‌రెడ్డి ఘంటా కొట్టినేట్టేనా..? అంటు ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్ చేశాడు.అయితే మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్‌లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆ ట్విట్ చేసినట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్ ఎస్‌లో మరో సంచలనానికి దారి తీస్తుందని చెప్పడానికి ఈ ట్విట్ అర్థం అని అంటున్నారు.

Revanth reddy tweet against minister jagadeesh reddy
కర్ణాటకలో జగదీశ్‌రెడ్డి తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయని, అందులో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా సంభాషణలు జరిగాయని, ఈ తంతు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ చెవిన పడినట్లు డక్కన్ క్రానికల్ దిన పత్రిక రాసింది. అందువల్ల ఈటెల రాజేందర్ లాగానే మంత్రి జగదీశ్‌రెడ్డిని కూడా మంత్రి పదవి నుండి తప్పిస్తారని ఆ పత్రిక రాసిన వార్త కథనాన్ని రేవంత్‌రెడ్డి తన ట్విట్‌కు జోడించాడు.
‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’…
కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం…
యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…?! pic.twitter.com/iyJxAx07gj— Revanth Reddy (@revanth_anumula) June 8, 2021