Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. అందుకే వైఎస్సార్సీపీ సైలెంట్ గా ఉంటోందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. అందుకే వైఎస్సార్సీపీ సైలెంట్ గా ఉంటోందా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :8 June 2021,5:28 pm

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మంచి పని చేసినా మెగాస్టార్ మెచ్చుకుంటున్నారు. కానీ చిరంజీవి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు మాత్రం వైఎస్సార్సీపీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రశంసలు దక్కట్లేదు. దీనికి కారణం మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారనే చిన్న సందేహమే. చిరంజీవి మరోసారి పాలిటిక్స్ లోకి ప్రవేశించే నేపథ్యంలో మనం ఎందుకు ఆయన్ని ఎంకరేజ్ చేయాలి? అనేది ఏపీలోని అధికార పార్టీ అభిప్రాయంగా తెలుస్తోంది. మెగాస్టార్ మనస్ఫూర్తిగా చేసే సాయాన్ని ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా ఓటేస్తే పర్లేదు గానీ మనంతట మనం ఆయనకు ఉచిత ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదని జగన్ టీమ్ భావిస్తోంది. అందుకే మెగాస్టార్ లేటెస్టుగా ప్రారంభించిన ఆక్సీజన్ బ్యాంకుల గురించి వైఎస్సార్సీపీ మాట వరసకైనా ప్రస్తావించట్లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వైఎస్ ఉన్నప్పటి నుంచే..

చిరంజీవికి, వైఎస్ ఫ్యామిలీకి మధ్య రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే సత్సంబంధాలు నెలకొన్నాయి. అసలు మెగాస్టార్ ని రాజకీయాల్లోకి రప్పించిందే వైఎస్ అని అంటుంటారు. వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీకి పడకుండా అడ్డుకోవటానికి చిరంజీవి చేత ప్రజారాజ్యం పార్టీని పెట్టించింది వైఎస్సే అని అప్పట్లో ప్రచారం జరిగింది. పెద్దాయన అనుకున్నట్లే జరిగింది కూడా. దానికి తగ్గట్లే మెగాస్టార్ తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేసి తొలుత రాజ్యసభ ఎంపీ పదవిని, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిని తీసుకున్నారనే టాక్ ఇప్పటికీ ఉంది. అదే క్రమంలో వైఎస్ జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి చిరంజీవి ఆయనతో పాజిటివ్ రిలేషన్స్ ని మెయిన్టెయిన్ చేస్తున్నారు.

Megastar chiranjeevi reentry to politics

Megastar chiranjeevi reentry to politics

సొంత పార్టీనా?.. సోదరుడి పార్టీనా?..: Chiranjeevi

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్లుగా మెగాస్టార్ రాజకీయాల్లోనూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే అది సొంత పార్టీ ద్వారానా లేక సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారానా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. పవర్ స్టార్ ఇప్పటికే వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు చిరంజీవిని పొగడటం ద్వారా పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ మైలేజీ ఇవ్వటం దేనికి అని జగన్ పార్టీ ముందుచూపు, ముందుజాగ్రత్త ప్రదర్శిస్తోంది. ఒకవేళ మెగాస్టార్ సొంతగా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే అప్పుడే ఇన్ డైరెక్టుగా సపోర్ట్ చేయటం బెటర్ అని ఏపీలోని రూలింగ్ పార్టీ ఒక కచ్చితమైన పాలసీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> చంద్ర‌బాబుకు భారీ షాక్‌.. పార్టీ మార‌నున్న టీడీపీ అధ్య‌క్షుడు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Roja : త్వరలో మంత్రి అవుతున్న రోజా

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan Vs Bjp : జగన్ తో జగడానికి.. కాలు దువ్వుతున్న కమలనాథులు..?

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది