Jagadishwar Reddy : కరోనా బారిన పడ్డ తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి..!
Jagadishwar Reddy : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ… తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
గత మూడు రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. హోం ఐసోలేషన్ లో ఉన్నానంటూ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయంటూ.. ఆ మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం వంటి నియమాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

telangana minister jagadishwar reddy tested covid positive
ఇదిలా ఉండగా భారత్ లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇటీవల.. సినీ , రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు.