Telangana : తెలంగాణలో మారుతోన్న రాజకీయ ముఖ చిత్రం.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : తెలంగాణలో మారుతోన్న రాజకీయ ముఖ చిత్రం.!

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2022,2:20 pm

Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు ఇంకో ఏడాది తర్వాత తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గనుక ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తే మాత్రం, ఈలోగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుంటుంది. నిజానికి, ఎన్నికలు ఇప్పుడే జరగబోతున్నాయా.? అన్నంత పొలిటికల్ హీట్ తెలంగాణలో కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక మేనియా ఓ వైపు, ఇంకోపక్క బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వ్యవహారం మరో వైపు.. వెరసి, తెలంగాణలో రాజకీయం మనుపెన్నడూ లేనంత వాడిగా, వేడిగా సాగుతోంది.

బస్తీ మే సవాల్.. అంటూ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు కనిపిస్తున్నాయి. సీన్‌లోకి తెలంగాణ రాష్ట్ర సమితి మిత్ర పక్షం మజ్లిస్ పార్టీ కూడా వచ్చేసింది. పాత బస్తీలో చాలా సంవత్సరాల తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్ని చూస్తున్నాం. కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయ పంచాయితీలూ షురూ అయ్యాయి. రాజకీయ అరెస్టులు, రాజకీయ ఆందోళనలతో తెలంగాణ అట్టుడికిపోతోంది. అవసరమా ఇదంతా.? అని తెలంగాణ సమాజం మొత్తుకుంటోంది. అయినాగానీ, ఎవరికి వారు ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఇదేం చెత్త రాజకీయం అనుకోవడానికి వీల్లేదు. రాజకీయమంటేనే అంత. ముచ్చటగా మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ కొట్టాలనే కసితో వుంది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణలో తొలిసారి అధికార పీఠమెక్కాలని ఆరాటపడుతోంది బీజేపీ. తెలంగాణ ఇచ్చింది తామే అయినా, రెండేళ్ళు అధికారానికి దూరంగా వున్నామనీ, హ్యాట్రిక్ ఫ్లాపు వద్దే వద్దని అనుకుంటోంది కాంగ్రెస్.

Telangana New Political Equations

Telangana, New Political Equations.!

రాజకీయ నాయకులు కప్పల తక్కెడ తరహాలో పార్టీలు మార్చేస్తున్నారు. నువ్వెంత.. అంటే నువ్వెంత.. అనే స్థాయిలో ఆయా పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు కనిపిస్తున్నాయి. ‘బాబోయ్ ఇదేం రచ్చ.?’ అంటూ గ్రేటర్ హైద్రాబాద్‌లో ప్రజలే కాదు, తెలంగాణ సమాజం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇప్పుడే ఇలా వుంటే.. ఎన్నికలంటూ వచ్చేస్తే, ఆ తర్వాత పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవడానికే ప్రజలు భయపడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం. వచ్చే ఎన్నికలు తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతాయి. ఔను, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. అదెలా అన్నది ప్రస్తుతానికి

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది