Rains : ఆ జిల్లాల వారు జాగ్ర‌త్త‌.. రానున్న 24 గంట‌ల‌లో కుండ‌పోత వ‌ర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rains : ఆ జిల్లాల వారు జాగ్ర‌త్త‌.. రానున్న 24 గంట‌ల‌లో కుండ‌పోత వ‌ర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Rains : ఆ జిల్లాల వారు జాగ్ర‌త్త‌.. రానున్న 24 గంట‌ల‌లో కుండ‌పోత వ‌ర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వాన‌లు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.దీంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలోని పలు జిల్లాలు రానున్న 24 గంటలపాటు ఇదే తరహాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

Rains వాన‌లే వాన‌లు..

వాయుగుండం ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. నారాయణపేట, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచిస్తుంది.

Rains ఆ జిల్లాల వారు జాగ్ర‌త్త‌ రానున్న 24 గంట‌ల‌లో కుండ‌పోత వ‌ర్షాలు రెడ్ అలర్ట్ జారీ

Rains : ఆ జిల్లాల వారు జాగ్ర‌త్త‌.. రానున్న 24 గంట‌ల‌లో కుండ‌పోత వ‌ర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురవనుండగా.. ఇక్కడ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. సాధారణంగా తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.తెలంగాణ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లిలోని సర్వాయిపేట, మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్‌లో వరుసగా 75.2, 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది