YS Sharmila : లైవ్ లో పోలీసులు అందరూ ఉండగానే వైయస్ షర్మిల కి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ యువకుడు..!!
YS Sharmila : YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా పాదయాత్ర ఆగిపోగా.. మళ్ళీ మొదలైంది. పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లో పాదయాత్ర జరుగుతూ ఉంది. పాదయాత్రలో భాగంగా అక్కడక్కడ ఆగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగా ఆ ప్రాంత సమస్యలను వివరిస్తూ వైఎస్ పాలనలో జరిగిన మేలులను ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది పెన్షన్ల కోసం
ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. రెండోసారి ముఖ్యమంత్రి అయినా గాని పెన్షన్ల విషయంలో కేసీఆర్ అశ్రద్ధ వహిస్తున్నారని విమర్శించారు. కనీసం రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు ఇస్తారు ఓట్లు వేయించుకున్నాక గాలిపదిలేస్తారు అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఎప్పుడు వచ్చినా మాటలు చెప్పి ఓట్లూ వేయించుకుంటున్నారు మళ్ళీ కనపడటం లేదు. ఈ క్రమంలో మధ్యలో యువకుడు లేచి మీరు అడిగే ప్రశ్నలకు ఎవరూ కూడా మా ఊరు వాళ్ళు మాట్లాడటం లేదు. మీతో పాటు పాదయాత్రలో నడిచిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో సదరు యువకుడికి వైఎస్ఆర్ షర్మిల ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చాయి..? అని అడగటం జరిగింది. దానికి అతడు బెడ్ రూమ్ ఇల్లు రాలేదు కానీ ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయని స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు రావటం జరిగిందని ఆ కుర్రోడు చెప్పకొచ్చారు. ఈ క్రమంలో షర్మిలపై కొద్దిగా సీరియస్గా కుర్రాడు మాట్లాడటంతో పాదయాత్రలో ఉన్న మనుషులు ఇంకా పోలీసులువారించటంతో పరిస్థితి సద్దుమణిగింది. దాదాపు వార్నింగ్ ఇచ్చే తరహాలో సదరు యువకుడు మాట్లాడటం అది కూడా లైవ్ లో అందరు చూస్తుండగా కావటంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
