TDP – Janasena : ఒక వైపు పొత్తు అంటూనే మరోవైపు టీడీపీకి జనసేన పోట్లు
TDP – Janasena : తెలుగు దేశం పార్టీతో జనసేనాని తెగ వెంపర్లాడుతున్నాడు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీతో కలిసి వెళ్లాలి అంటూ చాలా బలంగా కోరుకుంటున్నాఉడ. తెలుగు దేశం పార్టీ కి ఇప్పటికే హింట్ ఇస్తూ కలిసి పోటీ చేద్దాం అంటూ ముందస్తు ప్రకటనలు చేయడం వంటివి చేస్తున్నాడు. దాంతో తెలుగు దేశం పార్టీ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ కలిసి చేస్తారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ రెండు పార్టీలు కలిసినా ప్రయోజనం శూన్యం అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.
ఆ విషయం పక్కన పెడితే ఒక వైపు రాజకీయంగా పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు వెన్ను పోట్లకు పాల్పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు కావాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ ఇతర పార్టీల నుండి నాయకులను లాగే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులను ఆకర్షిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
గోదావరి జిల్లాల్లోని తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులతో ఇప్పటికే జనసేన నాయకులు మాట్లాడటం జరిగిందట. పవన్ యాత్ర సందర్బంగా వారు జనసేన పార్టీ లో జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరో వైపు తెలుగు దేశం పార్టీ కూడా జనసేన పార్టీని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి పొత్తుల పేరు చెప్పి దగ్గర అవుతూనే ఇలా వెన్ను పోట్లు పొడుచుకోవడం ఈ రెండు పార్టీలకే చెల్లిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.