Nara Lokesh : తెలుగు తమ్ముళ్ల అవివేకం.. లోకేష్‌ ని ‘లైగర్‌’ అంటున్నారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : తెలుగు తమ్ముళ్ల అవివేకం.. లోకేష్‌ ని ‘లైగర్‌’ అంటున్నారు

 Authored By prabhas | The Telugu News | Updated on :23 June 2022,6:00 am

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ నాయకులు కొన్ని సార్లు లోకేష్ పై ప్రశంసలు చేసే క్రమంలో ఆయన్ను ఇండైరెక్ట్‌ గా తిట్టడం లేదా ఎద్దేవ చేయడం చేస్తున్నారు. పాపం తెలుగు దేశం నాయకులకు ఆ విషయం అర్థం అవుతుందో లేదో అంటూ మీడియా వారికి కూడా అర్థం కావడం లేదు. లోకేష్ పై మరీ అతిగా ప్రశంసలు కురిపించి ఆయన దృష్టిలో పడాలని కొందరు చేసే ప్రయత్నం నవ్వు తెప్పిస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం ఇదెక్కడి విడ్డూరం అన్నట్లుగా ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున నారా లోకేష్‌ గురించి టీడీపీ నాయకులు తాజాగా చేస్తున్న లైగర్‌ వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతోంది.

నారా లోకేష్ ను కొందరు తెలుగు తమ్ముళ్లు లైగర్ అంటూ పిలుచుకుంటున్నారు. సాదారణంగా లైగర్ అంటే టైగర్ మరియు లయన్ ల క్రాస్ బ్రీడ్ ను లైగర్ అంటారు. ఆ విషయం తెలుగు తమ్ముళ్లకు తెలుసో తెలియదో కాని లోకేష్ ను లైగర్ అనేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. హీరో నే లైగర్‌ అంటున్నారు.. కనుక మా వాడు కూడా లైగర్‌ అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మాత్రం సోషల్‌ మీడియాలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు అవివేకం మరియు అజ్ఞానంతో లోకేష్ ను లైగర్ అంటూ సంభోదిస్తున్నారు.

telugu desam party leaders saying Nara Lokesh is liger

telugu desam party leaders saying Nara Lokesh is liger

సినిమా లో విజయ్ దేవరకొండ ను ఎందుకు లైగర్‌ అనేదానికి ఒక కారణం ఉంది. అసలు హీరో తనను తాను టైగర్‌ అని చెప్పుకుంటూ ఉంటాడు. కాని సినిమా లో హీరో విజయ్ దేవరకొండకు నత్తి వల్ల ‘ట’ అక్షరం ల మాదిరిగా వస్తుంది. అందుకే టైగర్‌ కాస్త లైగర్‌ అయ్యింది. మరి లోకేష్ విషయంలో లైగర్ అంటూ ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ఈ సందర్బంగా లోకేష్ భజన చేస్తున్న తెలుగు తమ్ముళ్లను మీడియా వారు మరియు వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది