women protest : ప్రేమ, సహజీవనం, ఆపై గర్భం.. పెళ్లి మాట ఎత్తేసరికి పరార్.. యువకుడి ఇంటి ఎదుట బాధితురాలి ఆందోళన..!
women protest : ప్రేమ పేరుతో దగ్గరై ఆపై సహజీవనం కూడా చేసి పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడంటూ ఓ యువతి సదరు అబ్బాయి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. పెద్దల సమక్షంలో ముందు పెళ్లికి ఒప్పుకుని.. ఇప్పుడు ఇంటినుంచి వెళ్లి తప్పించుకుని తిరుగుతున్నాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. తనకు పుట్టిన పాపను కూడా తన నుంచి దూరం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా మునగాలకు చెందిన ఈ మహిళ..

The victim lady worries that her boyfriend has cheated and left in nalgonda
women protest : తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని అక్కడే భీష్మించుకుని కూర్చుంది.హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చిన వెంకటేష్ తో… కంప్యూటర్ శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన తనకు పరిచయం ఏర్పడిందని బాధితురాలు తెలిపింది. ప్రేమ పేరుతో తనను లొంగదీసుకుని ఓ అద్దె గదిలో తనతో ఏడాది పాటు సహజీవనం చేసినట్లు పేర్కొంది. ఆ కారణంగా గర్భం దాల్చిన సమయంలోనూ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వెంకటేష్..
women protest : పెళ్లికి ముందే తమకు పుట్టిన పాపను వేరే వారికి ఇప్పించినట్లు చెప్పింది.అనంతరం ముందు తమ పెళ్లికి అంగీకరించిన వెంకటేష్ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మాట మార్చారని వాపోయింది. తనను పెళ్లి చేసుకోవడంతో పాటు తన బిడ్డను తనకు ఇప్పించాలని వేడుకుంటుంది. అయితే ఈ ప్రేమ వ్యవహారం తమ కుమారుడు ఇల్లు వదిలి పారిపోయే వరకు తమకు తెలియదని అబ్బాయి తల్లిదండ్రులు అనడం గమనార్హం.