Himalayas : హిమాలయాలు గురించి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలు..!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Himalayas : హిమాలయాలు గురించి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలు..!?

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2022,12:00 pm

Himalayas : హిమాలయాలు అనగానే అందరికి మొదటిగా గుర్తుచెడి అక్కడ వాతావరణం చాల బాగుంటుందని మరియూ చాలా ప్రశాంతంగా వుంటుంది యెంతో మంది పర్యాటకులు హిమాలయాలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇంతక ముందు హిమాలయాలు అంటే స్వర్గానికి దారి అని చెప్పేవారు అంతే కాకుండా ఒకప్పుడు దేవతలు కూడా హిమాలయాలలో నివసించేవారు. హిమాలయాలు గురించి అంతుచిక్కని 5 రహస్యాలు గురించి తెలుసుకుందాం..

1. గురుభోంగ్ మార్ సరస్సు: ఈ సరస్సు ప్రపంచం లో వున్న పెద్ద సరస్సులలో ఇది ఒకటి. ఇది సముద్రానికి 17500 అడుగుల ఎత్తులో ఉంటుంది మరియు ఇది టెస్టా నదితో కలిసి వుంటుంది, అలాగే కంచనజంగా మౌంటెన్ ప్రక్కన వుంటుంది. చలికాలం -20°c నుంచి -30°c వుంటుంది. సరస్సులు -4°c వుంటేనే గడ్డ కడతాయి కానీ ఇక్కడ -20°c నుంచి -30°c వున్నా సరస్సులోని నీరు గడ్డ కట్టదు ఒక ప్రదేశంలో దీనికి గల కారణం ఏమిటంటే గురు పద్మ సాంబవ అనే ట్రైబల్ దేవుడు ఆ సరస్సు ఎప్పుడు గడ్డ కట్టి వుండడం చూస్తాడు అప్పుడు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి మంచినీటి కష్టం చూసి ఆయన కరునించి ఆయన దగ్గర వున్నటువంటి ఆయుధంతో ఒక ప్రదేశంలో టచ్ చేస్తాడు అప్పుడు ఒక చిన్న సరస్సులా కొంత భాగం ఎప్పుడు గడ్డకట్టకుండా వుండే విధంగా చేయడం వలన అక్కడ వున్న ప్రజల మంచినీటి సమస్య తీర్చాడు. ఆ సరస్సు యొక్క మంచినీటిని తాగిన ప్రజలకు ఏటువంటి ఆనారోగ్య సమస్యలు కూడా వుండేవి కాదు అది ఎలానో ఇంత వరకూ ఎవరికి తెలియదు ఇప్పటికీ సైంటిస్టులకు కూడా అర్ధం కాని విషయం ఇది.

There Are So Many Secrets In Himalayas

There Are So Many Secrets In Himalayas

2. జ్ఞానగంజ్ నే సిద్ధ ఆశ్రమం అని కూడా అంటారు. ఈ ఆశ్రమంలో ఉండే వారికి ఒక ప్రత్యేకత వుంది అది ఏమిటంటే అక్కడ నివశించే వారికి చావు అనేదే వుండదు అంతే కాదు ఇక్కడ వుండేవారు గాలిని పీల్చుకొని మాత్రమే జీవిస్తూ ఉంటారు. ఎవరికైతే దేవుని మీద నమ్మకం వుండి ఎవరికి ద్రోహం చేయకుండా ఉండేవారికి మరియు అందరి మంచి కోరుకొనే వారికీ మాత్రమే ఈ ప్రదేశం కనిపిస్తుంది. మిగిలిన వారికి ఈ ప్రదేశం ఎంత వెతికినా ఎవ్వరికీ దొరకదు మరియు వెళ్ళడం కూడా చాలా కష్టం కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ఈ ఆశ్రమం ఎక్కడ అని వెతుకుతూనే వున్నారు. అక్కడ వున్నటువంటి యోగులకు సూపర్ నేచురల్ పవర్స్ వుంటాయి అంతే కాక వారికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతమో కూడా చెప్పగలరు,మన పూర్వం కూడా చెప్పగలరు.ఈ సాధువులకు వారు ఎప్పుడు చనిపోవలో అది వాళ్ల ఇష్టం మనం చూసినట్లయితే ఇది పురాణాలలో మరియు రుగ్వేదంలో కూడా కనిపిస్తుంది.

3. రుప్ కాండ్ సరస్సు: దీనికి మరియొక పేరు అస్థి పంజరాల గుట్ట అంటారు. ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 16,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. చలికాలంలో ఈ సరస్సు గడ్డ కడుతుంది కానీ వేసవికాలంలో మాత్రం ఈ సరస్సు ఎండిపోతుంది. అప్పుడు ఈ సరస్సు చాలా భయంకరంగా వుంటుంది ఇక్కడ పుర్రెలు, జుట్టు, ఏముకలు కనిపిస్తాయి కానీ అవి ఎవరివి అనేది ఇంకా ఒక మిస్టరీగానే ఉంది.కొంత మంది అవి ప్రపంచ యుద్ధం -2 లో చనిపోయిన వారివి అంటారు కొందరు అవి వారివి కాదు అంటారు మరి కొందరు ఇంకా పాతవి అని, కానీ ఇవి ఎప్పటివో తెలుసుకోవడం కోసం కొంతమంది వాటికి DNA టెస్టులు చేయడం జరిగింది అయితే అవి మాత్రం 850 A.D టైమ్ లోవి అని తేల్చారు.

4. గ్యాంగ్ ఖార్ ప్యునేసం: ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన అన్ టైమ్డ్ పర్వతం. నిజం చెప్పాలంటే ఇది ఎక్కడ వుందో ఇంకా ఎవరికి తెలియదు. కొంత మంది టిబెట్ లో అని మరి కొంత మంది ఇండియా లో అని అంటున్నారు. కానీ ఇది ఎక్కడ వుందో ఇంకా తెలియదు మరియు ఒక లొకేషన్ కూడా లేదు. ఇప్పటికీ చైనా మరియు టిబెట్ వాళ్ళు మాధి అంటే మాది అని అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఆ పర్వతం ఎక్కడానికి కూడా ట్రై చేస్తున్నారు కానీ ఎవ్వరూ వల్ల కాలేదు. చాలా మంది చెబుతూ ఉంటారు అక్కడ భూతాలు వుంటారని మరియు వింత వింత శబ్దాలు వస్తాయని అక్కడ దగ్గర ప్రజలు చెబుతుంటారు.

5. మౌంట్ కైలాష్: ఇది సముద్ర మట్టానికి 21000 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిమాలయాలలోనే అతి వింత అయిన ప్రదేశం. ఇక్కడ నుంచే ప్రపంచం మొదలు అవుతుంది అని అంటున్నారు. హిందువులు ఈ పర్వతం మీద శివుడు వున్నాడని వారి నమ్మకం. Ex: మానససరోవరం సరస్సు ఇది ఒక సూర్యుని ఆకారం లో వుంటుంది. ఇది మొదట నీలి రంగులో వుంటుంది తరువాత ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది