Husband And Wife : భార్యా, భర్తల నడుమ గొడవలను ఇలా దూరం చేసుకోండి..!
Husband And Wife : ఈ రోజుల్లో భార్యా, భర్తల మధ్య గొడవలు చాలా సర్వ సాధారణం అయిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడే స్థాయికి వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి జనరేషన్ లోనే గొడవలు ఎక్కువగా వచ్చి చివరకు విడిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే దాన్ని సర్దుమనిగేలా చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో అలా చేయకుండా గొడవలను మరింత పెంచుకుంటున్నారు. మరి గొడవలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Husband And Wife మెసేజ్ లు పెట్టొద్దు..
ఈ రోజుల్లో అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. దాంతో పార్ట్ నర్ తో గొడవలు వచ్చినప్పుడు చాలా మంది మెసేజ్ లు చేస్తుంటారు. అలా చేయకుండా నేరుగానే మాట్లాడాలి. ఎందుంకటే మెసేజ్ లు చేస్తే అపార్థాలు ఇంకా పెరిగిపోతాయి. దాంతో గొడవలు మరింత ముదురుతాయి. కాబట్టి నేరుగా మాట్లాడి గొడవలను తగ్గించుకోవాలి.
Husband And Wife అర్థమయ్యే విధంగా..
మీరు ఏదైనా విషయం చెప్పాలని అనుకుంటే మీ పార్ట్ నర్ కు అర్థం అయ్యే విధంగా స్పష్టంగా చెప్పండి. అంతే గానీ దాన్ని కూడా గొడవలాగా చెప్పొద్దు. నాకు ఈ విషయం నచ్చట్లేదు.. కానీ నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నట్టు మాట్లాడుతూ చెప్పండి. అది వారికి అర్థం అయితే మీకు హెల్ప్ అవుతుంది.
Husband And Wife అడగండి..
మీ పార్ట్ నర్ లో ఏదైనా విషయం మీకు నచ్చకపోతే దాని గురించి వివరణ అడగండి. అలా ఎందుకు చేస్తున్నారో, దాని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసుకోండి. అంతే గానీ.. అడకుండానే అదేదో తప్పు అని మీలో మీరే నిర్ణయం తీసుకోకండి. వాళ్లు చెప్పిన కారణం విన్న తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.
Husband And Wife పాజిటివ్స్ గురించి..
మీ పార్ట్ నర్ లో మీరు ఎక్కువగా పాజిటివ్స్ ను మాత్రమే చూడండి. అలా చేయడం వల్ల మీ పార్ట్ నర్ మీద మీకు ప్రేమ పెరుగుతుంది. అంతే గానీ మీ పార్ట్ నర్ లో కేవలం నెగెటివ్ అంశాలను మాత్రమే చూస్తున్నారంటే అది ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా మీ పార్ట్ నర్ పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయండి.