దేవుడికి పెట్టిన ప్రసాదం తరచూ చీమలు తింటే మీకు జరగబోయేది ఇదే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

దేవుడికి పెట్టిన ప్రసాదం తరచూ చీమలు తింటే మీకు జరగబోయేది ఇదే…!

దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు తింటూ ఉంటే మీ ఇంట్లో జరగబోయేది ఏంటో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం దేవుని పూజిస్తారు. అలాగే దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే అనేక సందర్భాలలో దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. దేవుడికని పెట్టినటువంటి ప్రసాదానికి చీమలు పట్టడం.. లేదా చీమలు ఆ ప్రసాదాన్ని తీసుకు వెళ్ళటం మన ఇంట్లో ఏదైనా జరుగుతుందని భయమేస్తూ ఉంటుంది. అసలు ఇలా జరగచ్చ.. జరగకూడదని అనేక […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 October 2023,8:00 am

దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు తింటూ ఉంటే మీ ఇంట్లో జరగబోయేది ఏంటో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం దేవుని పూజిస్తారు. అలాగే దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే అనేక సందర్భాలలో దేవుడికి పెట్టినటువంటి ప్రసాదం చీమలు పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. దేవుడికని పెట్టినటువంటి ప్రసాదానికి చీమలు పట్టడం.. లేదా చీమలు ఆ ప్రసాదాన్ని తీసుకు వెళ్ళటం మన ఇంట్లో ఏదైనా జరుగుతుందని భయమేస్తూ ఉంటుంది. అసలు ఇలా జరగచ్చ.. జరగకూడదని అనేక సందేహాలు ఉంటాయి. వాటికి సమాధానం అంటే దేవుడికి పెట్టిన ప్రసాదం గనుక చీమలు పడితే దాని అర్థం ఏంటి? ప్రకృతి ఏ విధంగా భవిష్యత్తులో రాబోయేటువంటి ఎలాంటి అంశాల గురించి మీకు తెలియజేస్తుందో మనం తెలుసుకుందాం.. అంతేకాదు ప్రసాదానికి లేదా నైవేద్యానికి సంబంధించిన అనేకపోకలు చాలా మందిలో ఉంటాయి. దేవాలయానికి వెళ్తే నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని ఏ విధంగా తీసుకోవాలి.

అసలు ప్రసాదం దేవుడికి ఎందుకు సమర్పించాలి తీర్థానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు కూడా తెలుసుకుందాం. చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి ప్రసాదం పెడితే అలాగే నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. పక్షులకు చేతులు ఉండవు కాబట్టి అలా నేరుగా తింటాయి. కానీ మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు. కుడి చేతితో ప్రసాదాన్ని తీసుకొని ఎడమ చేతిలోకి మార్చుకొని కుడి చేత్తో కొద్దికొద్దిగా తీసుకొని తినాలి. అలా కాకుండా కుడి చేతిలోకి తీసుకొని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెప్తారు. మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని పెద్దలు చెప్తారు.

తెలియని వారు తప్పకుండా తెలుసుకొని దేవుని ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని తీర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రసాదానికి చీమలు పడితే ఏదైనా జరుగుతుందా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. అసలు ఇంట్లో చీమలు కనిపించటం ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి పని. మన ఇంట్లో ఉన్నపలంగా నల్లచీమలు కనిపిస్తే మనకి ఆకస్మిక ధన లాభం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఎర్ర చీమలు చెడుకి శకుని అని చెప్తూ ఉంటారు. ఇంట్లో గనుక ఎర్ర చీమలు ఉన్నఫలంగా కనిపిస్తే అది జరగబోయే చెడుకి సంకేతంగా చెబుతూ ఉంటారు. ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపించే చీమలు గనుక మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం పట్టపోతుంది అని అర్థం. సాధారణంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అందరం తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న ప్రసాదానికి కానీ దేవుని దగ్గర పెట్టినటువంటి నైవేద్యానికి కానీ చీమలు పట్టడం అందరు గమనిస్తూ ఉంటారు.

this what will happen to you if ants often eat your offering to god

this what will happen to you if ants often eat your offering to god

ఇలా పడితే మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి మీరు బయటపడతారు అని అర్థం. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆర్థికంగా డబ్బు లేకుండా అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులతో సతపతమవుతున్నారో వారు ఆ కష్టాల నుంచి తప్పక బయటపడతారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించబోతుంది అని అర్థం. జీతం సరిపోకపోయినా మెరుగైన జీతం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆర్థిక కష్టాలనుంచి బయటపడాలన్న అనారోగ్య సమస్యలను పొందాలి అన్న ఏదైతే మీరు ఆ నైవేద్యాన్ని సమర్పించినప్పుడు భగవంతుని మనసులో కోరుకున్నారు మీరు ఏ కోరిక అయితే నెరవేరాలి అని ఆ మహాలక్ష్మి దేవిని భగవంతుని ప్రార్థించారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అని చీమల రూపంలో ప్రకృతి ద్వారా భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు అని తెలుసుకోండి. కాబట్టి నైవేద్యానికి కానీ ప్రసాదానికి కానీ చీమలు పడితే భయపడాల్సిన, సందేహించాల్సిన అవసరం లేదు. అవి లక్ష్మీదేవి రాకకి కష్టాలని తొలగిస్తున్నాయని చెప్పటానికి సంకేతంగా శుభానికి సంకేతంగా భావించండి ఆనందంగా జీవితాన్ని గడపండి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది