దేవుడు ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా .. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

దేవుడు ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా .. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం…!!

హైందవ ధర్మం ప్రకారం చేసిన పాపాలకు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కానీ చేసిన పాపం చెబితే పోతుంది అని చెప్పి పెద్దలు చెప్పిన నానుడి మాత్రం కొంతవరకే నిజం. చేసిన పాపాన్ని దేవుడు ముందు చెప్పుకుంటే ఆ పాపం ఎట్టి పరిస్థితుల్లో పోదు అని హైందవ ధర్మం చెబుతోంది. పాప ప్రక్షాళన జరగాలన్నా, చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలన్న మనం చేయవలసింది వాళ్లను క్షమాపణ అడగడమే. ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారితో […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,7:00 am

హైందవ ధర్మం ప్రకారం చేసిన పాపాలకు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కానీ చేసిన పాపం చెబితే పోతుంది అని చెప్పి పెద్దలు చెప్పిన నానుడి మాత్రం కొంతవరకే నిజం. చేసిన పాపాన్ని దేవుడు ముందు చెప్పుకుంటే ఆ పాపం ఎట్టి పరిస్థితుల్లో పోదు అని హైందవ ధర్మం చెబుతోంది. పాప ప్రక్షాళన జరగాలన్నా, చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలన్న మనం చేయవలసింది వాళ్లను క్షమాపణ అడగడమే. ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారితో మీ విషయంలో తప్పు చేశాను, నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీకు సంబంధించిన సొమ్మును దొంగలించాను లేదా వ్యాపారంలో మోసం చేశాను లేదా కుటుంబంలో గొడవలు పెట్టాను ఇలా అనేక రకాల అయినటువంటి సందర్భాలలో భగవంతుడి దగ్గర కూర్చొన పాపాలను చేసిన తప్పులను క్షమించమని చెబుతుంటాము. కానీ అలా చెప్పుకోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని శాస్త్రం చెబుతుంది.

పాపాలకు దోష నివారణ జరగాలంటే ఎవరి దగ్గర అయితే తప్పు చేశాము వాళ్లకి క్షమాపణ చెప్పాలి. అలా చెప్పాలని పదేళ్ల తర్వాత చెప్పకూడదు. మీరు చేసిన తప్పు వలన కుటుంబం నష్టాల పాలైన తర్వాత క్షమాపణలు చెబితే ఎటువంటి ఫలితం ఉండదు. మీరు చేసిన తప్పులను దేవుడు ముందు ఏడుస్తే చెబితే కేవలం మానసిక భారం మాత్రమే తగ్గుతుంది. అంతేకానీ చేసినటువంటి తప్పు ఏ మాత్రం తగ్గదు. హిందూ ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ధర్మ గ్రంథాలను ఆచరించడం తప్ప చేయగలిగేటువంటిది ఏమీ లేదు. కానీ మన తప్పులను వారితో చెప్పుకోగలిగితే కచ్చితంగా వాళ్ళు క్షమిస్తే అప్పుడు పాపాలు క్షమించబడతాయి. భగవంతుడి దగ్గర కూర్చొని ఏడవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవుడు పాపం చేయమని చెప్పలేదు. చేసిన తర్వాత చెప్పుకోమని చెప్పలేదు.

దేవుడు అసలు తప్పే చేయవద్దని చెప్పాడు. ఎవరికి హాని చేయవద్దు అని చెప్పాడు. తోటి వారి పట్ల జాలి దయ కలిగి ఉండమన్నారు. భగవంతుడికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ పాపమే. అలాంటి పాపాలు చేసి దేవుడికి చెప్పుకుంటే ఆ తప్పులు ఏమాత్రం తగ్గవు. ఎవరికైతే తప్పు చేశారో వాళ్లని క్షమాపణ అడిగితే పాప ప్రక్షాళన జరుగుతుంది. భగవంతుడితో చెప్పుకోవడం వలన కేవలం ఓదార్పు లభిస్తుంది. గుండెల్లో ఉన్న భారం తగ్గుతుంది. కానీ తప్పు చేశామని భావన కచ్చితంగా లోపల ఉంటుంది. ఆ తప్పును మరోసారి చేయమని భగవంతుడికి సంకల్పం చేసుకోవాలి. అలా చెప్పుకోవడం వలన మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఎంతో పుణ్యం చేస్తే కానీ దేవుడు దయ చూపాడు అంటారు. అలాంటి దేవుడిని దర్శించుకోవాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదు. దానధర్మాలు, దోష నివారణలు, పరిహారాలు చేసే వాటికన్నా ఎవరి పట్ల అయితే తప్పు చేస్తారో చెప్పి వారిని క్షమించమని అడగాలి. అలా చేయటం వలన భగవంతుడు మెచ్చుతాడు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక