God : దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే శుభమా అశుభమా.. ఇది దేనికి సంకేతం…!
ప్రధానాంశాలు:
God : దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే శుభమా అశుభమా.. ఇది దేనికి సంకేతం...!
God : హిందూ మతంలో ప్రతి ఒకరి ఇంట్లో ఉదయాన్నే దేవుడిని పూజిస్తారు. అయితే పూజలో ముఖ్యంగా ఉపయోగించేవి పువ్వులు. పువ్వులు లేకపోతే ఏ పూజ సంపూర్ణం కాదు. ఇక గుడికి వెళ్ళిన లేదా ఇంట్లో పూజ చేసిన దేవునికి తప్పకుండా పువ్వులను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే దేవుడికి పువ్వులు దండలను సమర్పించేటప్పుడు అవి కింద పడినప్పుడు ఆందోళనకు గురవుతారు. ఈ సమయంలో అనేక ఆలోచనలు మనసులో తలెత్తుతాయి. దీన్ని కొంతమంది శుభంగా భావిస్తే మరి కొంతమంది చెడుగా భావిస్తారు. మరి అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
God : ఇలా జరిగితే ప్రమాదానికి సంకేతం..
దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి సమర్పించిన పువ్వులు లేదా దండలు కింద పడిపోతే అది మీ జీవితంలో మార్పుకు సంబంధించింది కావచ్చు. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొని ఉంటే దానిని ఒకసారి పరిశీలించమని సంకేతమని భక్తులు భావిస్తారు. అదేవిధంగా మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలని సంకేతం.
God : సమయం ప్రదేశం ప్రభావం..
దేవుడికి సమర్పించిన పువ్వులు లేదా మాలలు కింద పడినప్పుడు వాటి ప్రదేశం అలాగే సమయం బట్టి ఫలితాలు ఉంటాయి. దీని అర్థం తప్పు సమయంలో పూజ చేశారని లేదా తప్పుడు స్థలంలో కూర్చొని పువ్వులను దండలను సమర్పించారు. అదేవిధంగా దేవుడికి సమర్పించిన పువ్వులు పూల మాల కింద పడితే దానిని అశుభంగా పరిగణిస్తారు. అంతేకాదు మీ పూజని దేవుడు అంగీకరించలేదని మీ కోరికలను నెరవేర్చడు అని అర్థం.
భగవంతుడి సందేశం ఏమిటంటే : పురాణ గ్రంధాల ప్రకారం చూసుకున్నట్లయితే దేవుడికి సమర్పించిన పువ్వుల మాల కింద పడినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడని అర్థం. మీ భక్తిని ఆయన మెచ్చాడని సూచన. అలాగే దీనిని దివ్య ఘట్టం శుభప్రదంగా కూడా భావిస్తారు. కాబట్టి మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైనట్లుగా మీ జీవితంలో మార్పులను చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు.