Thummala Nageswara Rao : టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వనున్న తుమ్మల నాగేశ్వరరావు.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెంటెండ్ అభ్యర్థిగా పోటీ?
Thummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావు తెలుసు కదా. తెలంగాణలో పలుకుబడి ఉన్న నేతే. మంత్రిగానూ పనిచేశారు కానీ.. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. అసలు.. ఆయన ఏ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. అయినప్పటికీ.. తన సొంత నియోజకవర్గం పాలేరు నుంచి మరోసారి పోటీ చేసి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు తుమ్మల. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నుంచి ఓడిపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ రెడ్డి గెలిచారు. గెలవడమే కాదు.. వెంటనే టీఆర్ఎస్ లో చేరడంతో పాలేరు టీఆర్ఎస్ లో రెండు వర్గాలుగా విడిపోయారు. తుమ్మల వర్గం, భూపేందర్ రెడ్డి వర్గాలుగా విడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో పాలేరు టికెట్ ఎవరికి దక్కుతుంది అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. నిజానికి.. తుమ్మల ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. భూపేందర్ రెడ్డి కూడా అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేదానిపై క్లారిటీ లేదు.
Thummala Nageswara Rao : టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా తుమ్మల పోటీలోకి దిగుతారా?
తుమ్మల మాత్రం తనకే టికెట్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. కానీ.. ఒకవేళ టీఆర్ఎస్ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అనేదానిపై ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు వేరే పార్టీల నుంచి పిలుపు వస్తున్నప్పటికీ.. వేరే పార్టీలోకి వెళ్లేందుకు తుమ్మల ఇష్టపడటం లేదు. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా పోటీ చేసి ఎక్కడైతే ఓడిపోయారో.. అక్కడే గెలిచి చూపించాలని తుమ్మల భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. తుమ్మల ప్లాన్ ఏంటో.. పాలేరులో ఎవరికి టికెట్ దక్కుతుందో.