Khammam : అందరి కళ్ళు ఖమ్మం వైపే… ఎంపీ టికెట్ కోసం ముగ్గురు దిగ్గజాలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Khammam : అందరి కళ్ళు ఖమ్మం వైపే… ఎంపీ టికెట్ కోసం ముగ్గురు దిగ్గజాలు…!

Khammam : రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తాయి. అంటే గెలవగలిగే అవకాశాలు ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో వారికి టికెట్ ఇవ్వడానికి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా పార్టీలు ఏ నియోజకవర్గాలలో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి నియోజకవర్గాల కోసం అభ్యర్థులు కూడా క్యూ కట్టుకొని నిలబడతారు. కర్ణాటక మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా విజయాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కు తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 January 2024,9:30 pm

Khammam : రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తాయి. అంటే గెలవగలిగే అవకాశాలు ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో వారికి టికెట్ ఇవ్వడానికి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా పార్టీలు ఏ నియోజకవర్గాలలో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి నియోజకవర్గాల కోసం అభ్యర్థులు కూడా క్యూ కట్టుకొని నిలబడతారు. కర్ణాటక మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా విజయాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కు తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందులోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ లో పోటీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పాలి. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఈ సీట్ పైన కన్ను వేయడం జరిగింది.రాజకీయాలలో నిత్యం వ్యూహాలు ప్రతి వ్యూహలతో పాటు అధిష్టానం దగ్గర పలుకుబడి గట్టిగా గొంతు వినిపించే సత్తా ఉన్నవారికి టికెట్ దక్కుతాయనే విషయం అందరికీ తెలిసిందే.ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పోటీ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.అయితే పార్లమెంటు ఎన్నికలు ఎంత దూరం లేవు. దాంతో ఎవరికి వారు సత్తా చాటుకోవడానికి టికెట్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈసారి పోటీలో ఉన్నవారు అన్ని విధాలుగా బలవంతులైన వారే. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఏర్పడిన రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రమే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే.

డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి పదవులను దక్కించుకున్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు మినహా అన్ని సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం వెనక ఈ ముగ్గురు నాయకులు కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు ఎంపీ రేసులో ఉండడం నిజంగా ఆసక్తికరమైన పరిణామామని చెప్పుకోవాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమె ఇటీవల జరిగిన కొన్ని సభలలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ మల్లు నందినికి కలిసి వస్తాయని అనుచర వర్గం చెబుతోంది. అలాగే బట్టి పోటీ చేసిన ప్రతిసారి నియోజకవర్గమంతా మల్లు నందిని కూడా ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ప్రజలకు దగ్గరైన మహిళా నేతగా మల్లునందిని మంచి పేరు సంపాదించుకున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న పరిచయాలు బట్టి నాయకత్వ ప్రతిమ కలిసి వస్తాయని భావనతో పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో కీలక నేత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం పోటీ చేస్తున్నారు.అయితే శ్రీనివాసరెడ్డి రాజకీయాలలోకిి వచ్చినప్పటి నుండి మొదట్లో వైఎస్ఆర్సిపి పార్టీలో తర్వాత బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. రాజకీయపరంగా ఆయన ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తన సోదరుడు ప్రసాద్ రెడ్డి తెర వెనుక నుండి అన్నీ చూసుకునేవాడు. పార్టీ నేతలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని సమాచారం. అంతేకాక 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలుపొందడానికి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథంలోనే ప్రస్తుతం సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా లో ఎంపీ గా ప్రసాద్ రెడ్డి నిలబడతారని తెలుస్తోంది.
ఇక మూడవ అభ్యర్థి అయిన తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక