TRS Party : నిన్న కాక మొన్న వచ్చిన వాళ్లను అందలం ఎక్కిస్తారా? తిరగబడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నేతలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS Party : నిన్న కాక మొన్న వచ్చిన వాళ్లను అందలం ఎక్కిస్తారా? తిరగబడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నేతలు?

 Authored By sukanya | The Telugu News | Updated on :4 August 2021,3:30 pm

TRS Party ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన నేతలకు పదిరోజుల్లోనే అందలం ఎక్కించడంతో టీఆర్ఎస్‌ నేతల్లో అంతర్మథనం షురూ అయింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నా, ఫలితం లేదన్న టాక్ కేడర్ లో వినిపిస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ TRS Party ఓడిపోయిన తర్వాత తేరుకున్న గులాబి TRS Party బాస్ .. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నాగార్జున సాగర్ నుండి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీని విజయఫథంవైపు నడిపిస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్  KCR తీరు పూర్తిగా మారిపోయింది.

TRS Party

TRS Party

కేవలం ఉప ఎన్నికలో విజయం కోసం అనేక అభివృధ్ది కార్యక్రమాలతోపాటు పార్టీ పదవుల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇదే మరో కొత్త రచ్చకు కారణమవుతోందని తెలుస్తోంది. తాజాగా కేవలం పదిరోజుల్లోనే పార్టీ మారిన ప్రత్యర్ధి నేతలను అందలం ఎక్కించారు. ఎంతో మంది సీనియర్లను కాదని పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఈ కీలక పరిణామంతో హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పార్టీ కేడర్‌కు గెలుపే లక్ష్యమనే సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం .. పార్టీలో ముఖ్యంగా పాతకాపుల్లో మరో రచ్చకు కారణమవుతోందని కిందిస్థాయి కేడర్ లో చర్చలు సాగుతున్నాయి. పాతకాపులు ఏం చేస్తారన్నదే కీలకంగా మారింది.


కొత్తవారికి పదవులపై రచ్చ TRS Party

ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పాత కేడర్ ఎలా ముందుకు సాగుతుందనే మీమాంస కార్యకర్తల్లో నెలకొంది. ఇక పాత కేడర్‌ను పక్కన పెడితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇటివల పార్టీ చేరికలతో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతో అనేక మంది ఇతర పార్టీ నేతలు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వీరికి ఎలాంటి పదవులు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కంటే సీనియర్లైన రమణ వంటి నేతలు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

KCR

KCR

వీరందరికీ ఏ హామీలు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారనేది తేలాల్సిన అంశం. ఇప్పటికే హుజూరాబాద్‌కు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ‌తోపాటు ఓ ఎమ్మెల్సీ కూడా వచ్చింది. ఇక మిగిలింది ఇటివల పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డిలతో పాటు స్వర్గం రవిలకు ఏం కట్టబెట్టనున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే పాతకాపులు ఎమ్మెల్సీ సీట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వీరిని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై అంతర్గతంగా రచ్చ సాగుతోందట. పార్టీని నమ్ముకుని, సేవ చేస్తోన్న తమకు పదవులు ఇవ్వకపోవడంపై వీరంతా కినుక వహించినట్లు సమాచారం. మరి వీరందరి అసంతృప్తిని కేసీఆర్ KCR ఏవిధంగా తగ్గిస్తారన్న దానిపై కేడర్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది