TRS MLA 2nd Audio Leak : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మరో ఆడియో లీక్.. బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రస్థావన
TRS MLA 2nd Audio Leak : మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. దానికి కారణం అక్కడ పారుతున్న డబ్బుల వరదే కారణం. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ పార్టీ డబ్బులను పంచుతున్నాయంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఇప్పటికే ఓ ఆడియో టేపు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆడియో విడుదలైంది. అందులో కొడంగల్, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు వెంటనే చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అందులో మాట్లాడుకున్నారు.
ఆ ఆడియోలో బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. వాళ్లకు తగిన ప్రాధాన్యత లేదని అందుకే డైరెక్ట్ గా సెంట్రల్ డీల్ చేస్తోందని ఆడియోలో చెప్పుకొచ్చారు. ఆడియోలో డిస్కస్ చేసిన వాళ్లు నందు, రామచంద్రభారతి, సింహయజులుగా తెలుస్తోంది. మొత్తం 27 నిమిషాల సంభాషణలో ఒక ఎమ్మెల్యే రూ.100 కోట్లు అడుగుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రావడానికి రెడీగా ఉన్నారని.. ఆయనతో పాటు మరో నలుగురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మరో వ్యక్తి చెప్పాడు.
TRS MLA 2nd Audio Leak : కాంగ్రెస్ నుంచి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా?
కాంగ్రెస్ నుంచి కూడా పలువురు నేతలు రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాలన్నీ సంతోష్ కు చెప్పాలని చెప్పడం ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. ఫామ్ హౌస్ డీల్ వ్యవహారం చివరకు ఢిల్లీకి చేరింది. అయితే.. వచ్చే వాళ్లంతా 100 అడుగుతున్నారని చెబుతున్నారు. మరి ఈ ఆడియో క్లిప్ పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.