TRS MLA : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఫోన్ పేలో కట్నం.. బలవంతంగా వసూలు చేయిస్తున్నారంటూ ఆరోపణలు
TRS MLA : ఈ మధ్య ప్రతిదీ ఆన్ లైన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆన్ లైన్ మయమే. డబ్బులు పంపించాలన్నా.. షాపింగ్ చేయాలన్నా.. టికెట్ బుక్ చేయాలన్నా.. ప్రతిదీ ఆన్ లైన్ అయిపోవడంతో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని అరచేతిలో స్మార్ట్ ఫోన్ ను క్లిక్ చేసి మరీ పనులు కానిచ్చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూతురు వివాహం కోసం ఆన్ లైన్ లో కట్నం పంపించడం చర్చనీయాంశం […]
TRS MLA : ఈ మధ్య ప్రతిదీ ఆన్ లైన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆన్ లైన్ మయమే. డబ్బులు పంపించాలన్నా.. షాపింగ్ చేయాలన్నా.. టికెట్ బుక్ చేయాలన్నా.. ప్రతిదీ ఆన్ లైన్ అయిపోవడంతో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని అరచేతిలో స్మార్ట్ ఫోన్ ను క్లిక్ చేసి మరీ పనులు కానిచ్చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూతురు వివాహం కోసం ఆన్ లైన్ లో కట్నం పంపించడం చర్చనీయాంశం అయింది. చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లు కనీసం రూ.5 వేలు ఇచ్చేలా సర్పంచుల ఫోరం నిర్ణయించిందట.
TRS MLA : బలవంతంగా సర్పంచ్ లతో ఆన్ లైన్ లో డబ్బులు వసూలు చేయిస్తున్నారట
ఒక్కో సర్పంచ్ కనీసం రూ.5 వేలు ఇచ్చేలా సర్పంచ్ ల ఫోరం నిర్ణయించిందట. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులను పంపించాలంటూ మూడు రోజుల నుంచి వాట్సప్ గ్రూపులలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఇదేంటి.. ఎమ్మెల్యే కూతురు పెళ్లి అయితే మాత్రం ఇలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ఏంటి. ఇష్టం ఉన్నవాళ్లు పెళ్లికి వెళ్లినప్పుడు ఇస్తారు..
లేదంటే లేదు కానీ… ఇలా అడగడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు సర్పంచ్ లు కూడా ఈ విషయంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. చొప్పదండి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే కూతురు వివాహం కోసం డబ్బులను బలవంతంగా వసూలు చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.