TRS MLA Affair : మహిళా లీడర్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎఫైర్..? సోషల్ మీడియాలో ఫుల్ వైరల్..
TRS MLA Affair : హుజూరాబాద్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీఆర్ఎస్ అనేక వ్యూహాలు రచించింది. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలంతా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కలియదిరుగుతున్నారు. గెలుపు బాధ్యతను మంత్రి హరీశ్‌రావు తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. ప్రత్యర్థి పార్టీలకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దని సీరియస్‌గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటుగా కాన్సిటెన్సిలోని ప్రతి మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. ఇక చిన్నా చితక నాయకుల గురించి చెప్పనవసరమే లేదు.
వేల సంఖ్యలో హుజూరాబాద్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా కొందరు నేతల ప్రవర్తన టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నది. ఓ మండలానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ఓ ఎమ్మెల్యే పార్టీ పరువు తీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే సుమారు 4 నెలలుగా జమ్మికుంటలోనే ఉంటున్నారు. పార్టీకి చెందిన నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఆయన ట్రాప్ చేశారని టాక్. మండలంలో పెద్దపదవి ఇప్పి్స్తానంటూ ఆమెకు ఆశచూపారని సమాచారం. సదురు ఎమ్మెల్యే తీరుపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. రాత్రయితే చాలు ఇక ఎమ్మెల్యే కథ వేరు. పార్టీ నేతలకు దూరంగా ఉంటూ రాసలీలలు నడుపుతున్నారని స్థానికులు గుసగుసలాడుతున్నారు.
TRS MLA Affair : జమ్మికుంట మండలంలో జోరుగా చర్చ..
ఇలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తీరును పసిగట్టిన వారిని పార్టీ నుంచి దూరంగా పెట్టినట్టు తెలుస్తున్నది. కొద్ది రోజులుగా వీరి వ్యవహారానికి సంబంధించిన వార్తలు జమ్మికుంట మండలంలోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ పెద్దల వరకు చేరడంతో నేతలంతా ఆయనపై గుర్రుగా ఉన్నాయని సమాచారం. ఓ వైపు ఎన్నికలో విజయం సాధించాలని నేతలంతా ప్రచారం పనిలో ఉంటే.. సదురు ఎమ్మెల్యే మాత్రం కామ్‌గా ఆయన పని కానిస్తున్నారట. మరి ఆయన తీరుపై పార్టీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయంపై వేచి చూడాలి.