TRS MLA : స్ట్రాంగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బీజేపీలోకి?? కేసీఆర్ కు నమ్మలేని షేకింగ్ న్యూస్
TRS MLA : అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో వలసల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ మీద బీజేపీ హైకమాండ్ దృష్టి సారిస్తోంది. ఢిల్లీ పెద్దలు తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణకు వచ్చి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు.. ఇప్పటికే బీజేపీలో చేరారు.
వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే త్వరలో బీజేపీలో చేరబోతున్నారట. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడంపై ఇప్పటికే రంగం సిద్ధమైపోయిందట. అంతే కాదు.. ఓ కేంద్రమంత్రి ఈయన బీజేపీలో చేరడం వెనుక ఉన్నారట. కేంద్రమంత్రితోనే డైరెక్ట్ గా ఆ ఎమ్మెల్యే డీల్ కుదుర్చుకున్నాడట.
TRS MLA : చీకోటి ప్రవీణ్ వ్యవహారం వల్లనే బీజేపీలో చేరుతున్నాడా?
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే కదా. క్యాసినో వ్యవహారంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు లింకులు ఉన్నాయనే వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేలకు ఈడీ నుంచి నోటీసులు కూడా వచ్చాయట. దీంతో ఓ ఎమ్మెల్యే వెంటనే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపాడట. ఈడీ కేసు నుంచి తనను తప్పిస్తే బీజేపీలో చేరేందుకు తాను రెడీగా ఉన్నట్టు ఆ ఎమ్మెల్యే బీజేపీ నేతలతో చెప్పాడట.
దీంతో వెంటనే కేంద్ర మంత్రి రంగంలోకి దిగి ఆ ఎమ్మెల్యేతో చర్చలు జరిపి ఆయన బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆ ఎమ్మెల్యేపై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. పేకాట ఆడుతూ ఆయన పోలీసుకు పలుమార్లు పట్టుబడినట్టు కూడా తెలుస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సాయంతో ఆ ఎమ్మెల్యే బయటపడినట్టు తెలుస్తోంది.