KCR : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ షాకిచ్చిన కేసీఆర్.. సిట్టింగ్ లకు నో టికెట్.. ఈసారి టికెట్లు ఎవరికి దక్కనున్నాయంటే?
KCR : తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ తన జెండాను మరోసారి రాష్ట్రంలో ఆవిష్కరించింది. రెండోసారి ముఖ్యమంత్రి అయి కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే.. అసలు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తాజాగా కలవరం మొదలయిందట. దేనికి అంటే.. అసలు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దొరుకుతుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే.. కమ్యూనిస్టు పార్టీలకు మునుగోడు ఎన్నికలు కాస్త ఊత్సాహాన్ని నింపడంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచేందుకు కమ్యూనిస్టు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఒకవేళ అదే జరిగితే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి మళ్లీ సీట్లు దక్కే అవకాశం ఉండదు. ఎందుకంటే.. కమ్యూనిస్టు పార్టీలకు కొన్ని సీట్లను కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వామపక్షాల అవసరం టీఆర్ఎస్ కు ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని సీట్లను వాళ్లకు కేటాయించాలి. అయితే.. కొన్ని టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను వామపక్ష పార్టీలకు వదిలిపెట్టాల్సి వస్తోంది. కొన్ని సీట్లను అది కూడా సిట్టింగ్ స్థానాలు కావడం వల్ల ఆయా సిట్టింగ్ స్థానాల్లో ఉన్న నేతలు తమ టికెట్లను కోల్పోవాల్సిందే.
KCR : కొన్ని సిట్టింగ్ స్థానాలను వామపక్షాలకు వదలాల్సిన పరిస్థితి
చాలామంది పలు టికెట్లను ఆశిస్తుండటంతో ఇక చేసేది లేక వామపక్షాల కోసం టీఆర్ఎస్ టికెట్లను కేటాయించాలి. అలాంటప్పుడు సిట్టింగ్ నేతల పరిస్థితి ఏంటి. వాళ్ల ఆశలపై టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నీళ్లు చల్లాల్సిందేనా. ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే కాదు.. ఎంపీ టికెట్లను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీల అభ్యర్థులు మంచి మెజారిటీతో విజయం సాధిస్తే.. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీలను కూడా ఆయా పార్టీలు టీఆర్ఎస్ ను డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే.. కొందరు నేతలకు గులాబీ బాస్ మొండి చేయి చూపించాల్సిందే. తప్పదన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో?