Karimnagar : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవు: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
Karimnagar : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవడం కోసం ఎన్నో అక్రమాలకు, కుట్రలకు బీజేపీ పాల్పడుతోంది. వాళ్ల పప్పులేవీ ఇక్కడ ఉడకవు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీజేపీ ఆటలు ఇక సాగవు. అబద్ధాలు చెప్పి.. అసత్య ప్రచారాలు చేసి ఎన్నిసార్లు గెలుస్తారు. ప్రజలకు అన్నీ తెలుసు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనే మీకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. అని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు.

trs mla sunke ravishankar on bjp in huzurabad bypoll
ఇక్కడి స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. బీజేపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకే ఎత్తులు వేస్తున్నారని స్పష్టం చేశారు. బీజేపీలో చేరి ఈటల కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని.. పాదయాత్ర పేరుతో ప్రజలను సెంటిమెంట్ తో ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారని.. కానీ.. ఈటల నాటకాలు ఏవీ పనిచేయవని ఆయన స్పష్టం చేశారు.
దళితుల బాగు కోసం, వాళ్ల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళిత బందును తీసుకొస్తే.. దాన్ని ఆపేందుకు మీరు కుట్ర పన్నుతున్నారా? కోర్టులో దేనికి కేసులు వేస్తున్నారు? మీరు ఎన్ని వేషాలు వేసినా.. దళిత బంధు ఆగదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా దళిత బంధు అమలు అవుతుంది.. అని రవిశంకర్ తెలిపారు.