TRS Party : ఈటలను ఓడించడం కోసం టీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తోందా? అందుకే ఆయన మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారా?
TRS Party హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ TRS Party నేతలు మంతనాలు జరపడం తెలంగాణ Telangana రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నికల్లో మద్దతు కోసమే ఆయన్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. హజురాబాద్ ఉపఎన్నికలు, రేవంత్ రెడ్డి Revanth reddy వర్సెస్ మల్లారెడ్డి, బండి సంజయ్ పాదయాత్ర…ఇలా వరుస ఎపిసోడ్‌లతో రోజుకు రోజుకు సెగలు రేపుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసంలో గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు.
దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వీరంతా గద్దర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని గద్దర్ ను కోరినట్లు సమాచారం. ఐతే గద్దర్ మాత్రం టీఆర్ఎస్ హామీ ఇవ్వలేదని, తటస్థంగా ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
కిషన్ రెడ్డితో గద్దర్ భేటీ.. Gaddar
వారం రోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించినట్లు తెలిసింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని గద్దర్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్ నేతలు గద్దర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకు అప్రమత్తమై.. గద్దర్ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను పంపించారని ప్రచారం జరుగుతోంది.
ఐతే గద్దర్‌తో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని.. కేవలం మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే.. రానున్న రోజుల్లో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని భావిస్తోంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. అందుకే గద్దర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే గద్దర్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. గద్దర్ తటస్థ వైఖరిపైనా సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పటికే కేసులతో నానా తంటాలు పడుతోన్న గద్దర్ .. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్న వైఖరికి వచ్చారని టాక్ వినిపిస్తోంది.