TS RTC : టీఎస్ ఆర్టీసీ నుంచి గుడ్ న్యూస్.. ఇక నుంచి 12 ఏళ్ల‌లోపు పిల్లలకు శాశ్వ‌త ఉచిత ప్ర‌యాణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TS RTC : టీఎస్ ఆర్టీసీ నుంచి గుడ్ న్యూస్.. ఇక నుంచి 12 ఏళ్ల‌లోపు పిల్లలకు శాశ్వ‌త ఉచిత ప్ర‌యాణం..!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2022,7:20 pm

TS RTC : తెలంగాణ ఆర్టీసీ నూతన ఏడాది కానుకగా కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్ల లోపు పిల్ల‌లంద‌రికీ టీఎస్ ఆర్టీసీ బ‌స్సుల‌లో శాశ్వతంగా ఉచిత ప్ర‌యాణం కలిపించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చర్యలు వేగవంతం చేస్తామని టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు.

కాగా ముందుగా ఇప్ప‌టికే నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ రోజు మొత్తం 12 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారు ఆర్టీసీ బ‌స్సులో ఉచితంగా ప్ర‌యాణించే అవకాశాన్ని కల్పించారు. ఇక ఈ నిర్ణయాన్ని శాశ్వతంగా అమలు పరుస్తామని తెలియజేయడంతో రాష్ట్ర ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

TS RTC announced tha providing free transportion to childrens below 12 years

TS RTC announced tha providing free transportion to childrens below 12 years

రాజధాని హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లను నిర్వ‌హించిన సందర్భంలో ఈ మేరకు ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో పాటు ఎండీ స‌జ్జ‌నార్ ఈ విషయాన్ని తెలిపారు. తాజా నిర్ణయంతో… టీఎస్ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో కూడా పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని సజ్జనార్ తెలిపారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది