TTD JL Recruitment jobs : టీటీడీ జాబ్ నోటిఫికేషన్.. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు..!
ప్రధానాంశాలు:
TTD JL Recruitment jobs : టీటీడీ జాబ్ నోటిఫికేషన్ .. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు..!
TTD JL Recruitment jobs : తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.గవర్నమెంట్ సంస్థ అయిన APPSC నుంచి APPSC TTD JL రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగాలు భర్తీ చేశారు.ఇందులో 04 లైబ్రేరియన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయసు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అర్హత అయినవారు వెంటనే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన APPSC ద్వారా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.
ఇదే నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78JL జాబ్స్ భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపదలింపు వర్తిస్తుంది. ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా నీట్ ఎగ్జాంలో క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విధుల్లో చేరగానే 60 వేల వరకు జీతం ప్రతి నెల లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 1 నుండి చివరి తేదీ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ప్రభుత్వ సంస్థ వారు అధికారికంగా పరీక్ష తేదీలు ఇవ్వలేదు. త్వరలో ఇస్తామని తెలిపారు. ఈ సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. పరీక్షకు సంబంధించి పూర్తి సిలబస్ నోటిఫికేషన్ లో చూడవచ్చు. టీటీడీ ప్రభుత్వ సంస్థ కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల వారు ఈ జాబ్ లకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతం కూడా బాగానే ఉంటుంది.