Tummala Nageshwar Rao : మళ్లీ బాంబ్ పేల్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. ఆ నేత పార్టీని నాశనం చేస్తున్నాడంటూ కామెంట్స్?
Tummala Nageshwar Rao : తెలంగాణ పాలిటిక్స్‌లో రాజకీయం ఒక్కసారి హీటెక్కింది. ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో గెలుపుదిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. తమ వ్యూహలకు పదును పెడుతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే.. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుల పక్షాన.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిరుద్యోగల పక్షాన పోరాడేందుకు సమరశంఖం పూరించారు. ప్రతిపక్షాల ముప్పేట దాడితో ఏం చేయాలో తెలీక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
గులాబీ బాస్ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొని వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన వ్యూహలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తొలి కేబినెట్‌లో మంత్రిగా చేసి.. ప్రస్తుతం మాజీ మంత్రిగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు తమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుంది. కేడర్ కూడా బలంగా ఉంది. అయితే, అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సొంత పార్టీ నేత టీఆర్ఎస్ పార్టీకి చేయాలనుకున్న డ్యామేజ్ పై పెదవి విరిచారు.
Tummala Nageshwar Rao : గులాబీ పార్టీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
‘ఒక చోట ఉండి మరొకరితో కాపురం చేయవద్దంటూ’ సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాత మధును గెలిపించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, అందుకోసం కృషి చేసిన జిల్లా టీఆర్ఎస్ నేతలకు కృతజ్ఞతలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని, జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. కానీ ఒకరి వలన పార్టీకి నష్టం కలుగుతుందంటూ ఆ నేత పేరు ఎత్తకుండా పరోక్షంగా కామెంట్స్ చేశారు. అయితే, తుమ్మల వ్యాఖ్యలు నేరుగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ను ఉద్దేశించి చేసినవని ఉమ్మం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.