కరోనా సెకండ్ వేవ్… రెండు మాస్క్ లు తప్పనిసరి అంటున్న నిపుణులు
corona masks : కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షల వరకు నమోదు అవుతున్నాయి. ఈ సంఖ్య మరెంతగా ఉంటుందో అనే అనుమానం ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిని తీసుకోని వారిని ఇలా ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ పెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాల్సిందే తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. మొన్నటి వరకు ఒక్క మాస్క్ అన్నారు. ఇప్పుడు తప్పనిసరిగా రెండు మాస్క్ లను ధరించాల్సిందిగా సూచిస్తున్నారు. రెండు మాస్క్ లను కూడా సరిగ్గా పెట్టుకుంటేనే కరోనా భయం ఉండదని అంటున్నారు.
corona masks : సర్జికల్ మాస్క్‌లు వద్దు..
ఇటీవల కరోనా ను నిరోధించేందుకు ఎక్కువ శాతం మంది సర్జికల్ మాస్క్ లను వినియోగిస్తున్నారు. రీ యూజబుల్ మాస్క్ లను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ రెండు మాస్క్ లు కూడా మొహానికి సరిగా అమరక పోవగా అవి మరీ పల్చగా ఉంటడం వల్ల కరోనాను ఆపే శక్తి తక్కువగా కలిగి ఉన్నాయని ఉత్తర కరోలైనా యూనివర్శిటీ వారు ఒక ప్రయోగంలో నిర్థారించారు. డబుల్ మాస్క్ అయితేనే కరోనాను 99 శాతం వరకు నిరోధిస్తుందని వారు చెబుతున్నారు. సింగిల్ మాస్క్ అనేది కేవలం 75 శాతం వరకు మాత్రమే వైరస్ ను అడ్డుకుంటున్నట్లుగా వారు చెబుతున్నారు.
corona masks : మాస్క్ పెట్టుకుంటే..
మాస్క్ పెట్టుకున్నాం కదా ఇంకా మనకు ఏమీ కాదులే అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయట కాలు పెడితే మాస్క్ అయితే పెడుతున్నారు కాని అది ఎలా పెట్టుకుంటున్నారు అనేది వారు సరిగ్గా పట్టించుకోవడం లేదు. మాస్క్ అనేది సరిగ్గా ఫేస్ కు అమరి పోవాలి. బయట నుండి చిన్న గాలి రేణువు కూడా మాస్క్ నుండి కాకుండా నేరుగా ముక్కులోకి వెళ్ల కూడదు. అలా మాస్క్ పెట్టుకుంటేనే కరోనా అనేది దూరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇకపై రెండు మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలంటూ వారు సలహా ఇస్తున్నారు.