Black Fungus : తెలుగు రాష్ట్రాల్లోకి బ్లాక్ ఫంగస్ ఎంటర్.. అసలేంటి ఈ ఫంగస్? దీని లక్షణాలు ఏంటి?
Black Fungus : చాలామందికి తెలియదు కానీ.. కరోనా వచ్చిన వాళ్లలో కొందరికి అతి తక్కువ మందికి వస్తున్న ఇన్ఫెక్షన్ ఇది. దీని పేరే బ్లాక్ ఫంగస్. మన దేశంలో ముందుగా ఈ ఇన్ఫెక్షన్ గుజరాత్ రాష్ట్రంలో కనిపించింది. అక్కడ కరోనా సోకిన వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్ సోకింది. ఆ తర్వాత మెల్లగా ఢిల్లీకి, ఆ తర్వాత మహారాష్ట్రకు ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకింది. తాజాగా తెలంగాణలోనూ ఈ కేసులు వెలుగు చూడటం గమనార్హం.

all you must know about black fungus
అసలు.. ఏంటి ఈ బ్లాక్ ఫంగస్ అంటే.. దీన్నే సైంటిఫిక్ మ్యూకర్ మైకోసిస్ అని పిలుస్తారు. ఇది కూడా కరోనా లాగానే ఒక అరుదైన వ్యాధి. ఇది ఒక ఫంగస్. మనకు గాలిలో ఎన్నో ఫంగస్ లు ఉంటాయి. ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలాగానే ఇది కూడా. కాకపోతే.. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లను ఇది అటాక్ చేస్తుంది. కరోనా వచ్చిన వాళ్లకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం మూలాన.. ముందు కరోనా రోగులను బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తోంది. దీంతో కరోనా వచ్చిన వాళ్లలో కొందరు ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తోనూ బాధపడుతున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్ లో కొన్ని ఆసుపత్రుల్లో ఇటువంటి కేసులు నమోదు అయ్యాయట. తెలంగాణతో పాటు ఏపీలోనూ కొన్ని బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ పై ప్రభుత్వం అలర్ట్ గా ఉందని ఇటీవలే మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన మందులను కూడా తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే.. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన చాలామంది… వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట.
Black Fungus : షుగర్ ఉంటే.. బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువ
షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకు బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుందట. అలాగే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నా కూడా బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంది. అందుకే.. బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే కరోనా జాగ్రత్తలతో పాటు బ్లాక్ ఫంగస్ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే ఇది ఎక్కువగా కరోనా సోకిన వాళ్లకే సోకుతుండటంతో కేవలం కరోనా సోకిన వాళ్లు.. కరోనా తగ్గినా కూడా కనీసం ఒక నెల రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి.