Types of Salts : అసలు ఉప్పు తినాలా వద్దా? ఏ ఉప్పు మంచిది? ఏ ఉప్పు చెడ్డది?
Types of Salts : ఉప్పు ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? ఉప్పు లేకుంటేనేమో.. కూరలు రుచి ఉండవు. అసలు.. ఏ ఉప్పు వాడాలి. దొడ్డుప్పా? లేక ప్యాకెట్లలో వచ్చే అయోడైజ్ డ్ అని రాసి ఉండే ఉప్పా? ఏంటో.. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది కదా. కొందరేమో ఉప్పు తినాలి అంటారు. మరికొందరేమో ఉప్పు తినొద్దు అంటారు. ఉప్పు మానేస్తే ఎన్నో రోగాలు తగ్గుతాయి అంటారు. కానీ.. ఉప్పు లేని కూరలను తినగలమా? మన నాలిక ఉప్పులేని కూరను సహిస్తుందా? వీటన్నింటికీ ఇక్కడ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. కూరల్లో ఉప్పు సరిగ్గా పడితేనే దానికి టేస్ట్. లేకపోతే కూర టేస్టే మారిపోతుంది. అందుకే చాలామంది కూరల్లో ఎక్కువ ఉప్పు వేసుకొని తింటుంటారు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఎందుకంటే.. మార్కెట్లలో దొరికే ఉప్పు ప్యాకెట్లలో ఉండే ఉప్పులో అయోడిన్ ను కృత్రిమంగా కలుపుతారు. నిజానికి ఉప్పులో ఉండే అయోడిన్ అనేది సహజసిద్ధంగా ఉప్పులోనే తయారవుతుంది. కానీ.. కొన్ని కంపెనీలు.. ఉప్పును రిఫైన్ చేసి.. దాంట్లో అయోడిన్ ను సపరేట్ గా కలిపి అమ్ముతున్నాయి. దాంతోనే వచ్చింది పెద్ద సమస్య.
నిజానికి అయోడిన్ అనేది మనిషికి చాలా అవసరం. కానీ.. అది సహజ సిద్ధంగా ఉండాలి కానీ.. కృత్రిమంగా కలిపింది కాదు. అందుకే.. ఉప్పు తినాలి కానీ.. ఏది పడితే ఆ ఉప్పు కాదు.
Types of Salts : ఉప్పులోనూ ఐదు రకాలు ఉంటాయి
మనకు తెలియని ఉప్పులు ఉంటాయి. ఉప్పులో ఐదు రకాలు ఉంటాయట. వాటి పేర్లు సైంధవ, సముద్ర, సువర్చల, విద, రొమక. ఈ ఐదు రకాల ఉప్పులు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. వీటి వల్ల నరాలు పటిష్ఠం అవుతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. ఉబ్బరం, తిమ్మిరి లాంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
సైంధవ లవణం
సైంధవ లవణాన్నే సెంధ నమక్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో లభిస్తుంది. దీన్ని అన్ని కూరల్లో వాడుకోవచ్చు. ఎక్కువగా ఉపవాసాలు చేసే సమయాల్లో ఈ ఉప్పును వాడుతుంటారు.
సముద్ర
దీన్నే సముద్ర ఉప్పు లేదా జాడా ఉప్పు అని కూడా అంటారు. ఇది రాళ్లలా ఉంటుంది. అందుకే దీన్ని రాళ్ల ఉప్పు అని కూడా అంటారు. సముద్ర ఉప్పును ఎక్కువగా పప్పులు, గింజలు ఉడకబెట్టే సమయంలో వాడుతారు. కొందరు సముద్ర ఉప్పును స్నానం చేసే సమయంలోనూ వాడుతుంటారు.
సువర్చల(నల్ల ఉప్పు)
సువర్చల దీన్నే నల్ల ఉప్పు అంటారు. దీన్ని ఎక్కువగా పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు శర్బత్, నిమ్మకాయ సోడా, పచ్చళ్ల తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
విద, రొమాకా ఉప్పులు
ఈ రెండు రకాల ఉప్పులను పలు థెరపీల్లో ఉపయోగిస్తారు.