Uttam Kumar Reddy : రాజకీయాలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాశ్వత రాజీనామా..!
Uttam Kumar Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్. ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ.. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా ఆయన చేసింది కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో
కాంగ్రెస్ పార్టీ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీతో గెలుస్తుందట. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే.. తాను చెప్పిన ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా కూడా తాను రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా అని శపథం చేశారు. నిజానికి.. ఇదివరకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ పోటీ చేసి గెలిచిన వారే. అందుకే.. ఆయన అలా ప్రకటించి ఉంటారా అని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
Uttam Kumar Reddy : ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నిజంగానే రాజకీయాలకు దూరం అవుతారా?
ఉత్తమ్ చెప్పినట్టు కాకుండా కోదాడ, హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాను నిజంగానే రాజకీయాలు శాశ్వతంగా దూరం అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు, వాగ్దానాలు సర్వసాధారణమే కానీ.. వీటిని ఏ రాజకీయ నేత పాటించరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సవాళ్లు, హామీలు లాంటివి కేవలం ఎన్నికల వరకే ఉంటాయి. ఆ తర్వాత ఎవరి గోల వారిది అంటున్నారు. ఇవన్నీ కేవలం ఓట్ల కోసం పడే పాట్లు అంటున్నారు. ప్రస్తుతం నల్గొండకు ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చెప్పినట్టుగా కోదాడ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందా వేచి చూడాల్సిందే.