ప్రేమలో పడి పారిపోయి పెళ్లి చేసుకున్న వదిన, మరదలు..!!
సమాజంలో రకరకాల పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చట్టాలు కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనిషి జీవన విధానంలో… బతకాల్సిన రీతిలో కంటే ప్రకృతికి వ్యతిరేకంగా బతికే పరిస్థితి ప్రస్తుత ప్రపంచంలో కనిపిస్తుంది. దీంతో చాలా దేశాల ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. స్త్రీలు స్త్రీలతో వివాహం… పురుషులు మరియు పురుషులతో వివాహం చేసుకునే పరిస్థితి సమాజంలో కనిపిస్తుంది. భారతదేశంలో కూడా ఎటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగానే ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.
పూర్తి విషయంలోకి వెళ్తే యూపీలో సంబల్ జిల్లాలోని బహేజోయ్ గ్రామంలో ఓ యువతీ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆ యువతికి వరుసకు మరదలు అయ్యే మరో యువతితో స్నేహం ఏర్పడింది. ఒకే గ్రామంలో ఉండటంతో చిన్నతనం నుంచే స్నేహంగా ఉండేవారు. అయితే పెరిగి పెద్దవారైనా కొద్దీ వీరిద్దరి మధ్య బంధం మరింతగా బలపడింది. ఈ క్రమంలో సదరు యువతీ తన మరదలితో కలిసి నోయిడా లోని ఓ కంపెనీలో కూడా పని పొందుకోవటం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఇంట్లో వారికి బంధువులకి చుట్టుపక్కల ప్రజలకు తెలియడంతో ఊరు వదిలే ఇల్లు వదిలే పారిపోయి
పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన యువతుల తల్లిదండ్రులు వారికోసం తీవ్రంగా గాలించారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు. ఆ ఇద్దరి యువతలో ఇంటి నుంచి పారిపోయిన ఏడు నెలల తర్వాత బహెజోయ్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు వారిద్దరిని ఎవరింటికి వారిని పంపించినట్లు తెలపడం జరిగింది. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు స్పష్టం చేశారు.