Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ అరెస్ట్.. ఏ1 గా ఆయన మార్చాలని భావిస్తున్న పోలీసులు
Vallabhaneni Vamsi : ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో వైసీపీ నాయకులకి కంటిపై కునుకు లేకుండా పోతుంది.ఏపీలో గత టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పాత పాపాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ ఖాయంగా కనిపిస్తుంది. అప్పట్లో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించడం ఓ ఎత్తయితే సొంత పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన అమెరికాకు పరారయ్యారు. . గన్నవరం దగ్గరలో ముందుగా ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Vallabhaneni Vamsi : అరెస్ట్‌ల పర్వం..
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ వేరే మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నాడని పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వంశీ వాహనాన్ని పోలీసులు గమనించారు. వాహనాన్ని అనుసరించి ఇంటికి సమీపంలోనే అరెస్ట్ చేశారు. కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనని అరెస్ట్ చేశారు.
గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో వంశీ పాత్రపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటి ఆధారంగా అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుసుకున్న వంశీ.. హైదరాబాద్ నుంచే అమెరికా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వెళ్లి మరీ ఆయన్ను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో వంశీతో పాటు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వంశీ మినహా మిగిలిన వారిని కోర్టులో హాజరుపర్చారు కూడా. నాడు ఎమ్మెల్యేగా ఉండి తన అనుచరులను రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ కేసును బయటకు వెలికి తీశారు. టీడీపీ దాడి కేసులో పాల్గొన్న కొందరు వైసీపీ కార్యకర్తలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెదుకుతున్నారు