Panner Biryani : నోరూరించే కమ్మనైన పన్నీర్ బిర్యాని… ఇలా చేయండి…
Panner Biryani : బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రస్తుతం ఎక్కడ దావత్ జరిగిన ముందు బిర్యాని ఉంటుంది. ప్రతి ఒక్కరు అంతగా ఇష్టపడుతున్నారు. బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యాని ఇంకా ఎన్నో బిర్యానీ రకాలు ఉన్నాయి. వాటిలో పన్నీర్ బిర్యాని ఎంతో టేస్టీగా ఉంటుంది. దానిని చేసుకోవడానికి ఎంతో సమయం కూడా పట్టదు. ఇంకెందుకు ఆలస్యం పన్నీర్ బిర్యానిని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) బాస్మతి రైస్ 2) పన్నీర్ 3) నెయ్యి 4) ఆయిల్ 5) ఉప్పు 6) కారం 7) పసుపు 8) బిర్యానీ ఐటమ్స్ 9) బాదంపప్పు 10) ఉల్లిపాయ 11) పచ్చి మిర్చి 12) కొత్తిమీర 13) ధనియాల పొడి 14) గరం మసాలా పొడి 15): అల్లం పేస్ట్
తయారీ విధానం: ముందుగా 200 గ్రాములు పన్నీర్ తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అరగంట ముందు రెండు గ్లాసుల బాస్మతి రైస్ ను నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక పన్నీర్ ముక్కలని వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలర్ మారేంతవరకు వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక బిర్యాని ఇంగ్రిడియంట్స్, ఏడు జీడిపప్పు పలుకులు వేసి కలుపుకోవాలి.
తర్వాత తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు, మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా మగ్గాక రెండు మూడు టమాట ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు కలుపుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి కుక్కర్ మూతలు పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యాని రెడీ.