ఈ వీడియో చూస్తే మీ కన్నీళ్లు ఆగవు.. డాక్టర్ల కాళ్లకు మొక్కుతారు?
doctors గత సంవత్సరం వచ్చిన కరోనా కంటే.. కరోనా సెకండ్ వేవ్.. దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. కరోనా వైరస్ రూపాంతరం చెంది భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో విపరీతంగా పెరుగుతోంది. వేరే ఏ దేశాల్లో అంతగా ప్రభావం చూపని కరోనా.. మన దేశంలో మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కు జనాలు చాలా భయపడ్డారు. కానీ… రెండో దశ కరోనాకు జనాల్లో భయం పోయింది. అదే కరోనా వ్యాప్తి మరింత పెరిగేలా చేసింది. మరోవైపు ప్రభుత్వాలు కూడా ముందు కరోనా సెకండ్ వేవ్ ను లైట్ తీసుకున్నాయి. దీంతో అది ఒక్కసారిగా చాప కింద నీరులా విస్తరించింది. దీంతో రోజూ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు.

video of doctors viral how they treat patients
ప్రభుత్వాలు ముందే మేల్కొని కరోనా పేషెంట్లకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు సిద్ధం చేయలేకపోయింది. వాటికి దేశవ్యాప్తంగా తీవ్రంగా కొరత ఉన్న నేపథ్యంలో కరోనా పేషెంట్లు చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇక.. ఆసుపత్రుల్లో బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోవడం, సిబ్బంది మాత్రం చాలా తక్కువ ఉండటంతో.. కరోనా పేషెంట్లకు చికిత్స చేయలేక డాక్టర్లు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. చేయాల్సిన సమయం కంటే ఎక్కువ సేపు డ్యూటీ చేయడం, సెలవులు లేకపోవడం, తిండి సరిగ్గా లేకపోవడంతో… డాక్టర్ల వేదన వర్ణణాతీతం.
doctors : ఈ డాక్టర్లకు హేట్సాఫ్ చెప్పాల్సిందే
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ల వీడియో అది. వందల మంది కరోనా పేషెంట్లకు విరామం లేకుండా ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లకు కనీసం ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. కరోనా పేషెంట్లు ఆసుపత్రుల చుట్టూ క్యూ కడుతుంటే డాక్టర్లకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది. కరోనా పేషెంట్లకు సేవ చేసి చేసి… అలసిపోయి.. అక్కడే కింద డాక్టర్లు కాసేపు ఎలా సేద తీరుతున్నారో చెప్పే వీడియో. ఈ వీడియో చూశాక.. డాక్టర్లను పల్లెత్తు మాట అనడం కాదు… డాక్టర్ల కాళ్లకు మొక్కుతారు మీరు. ఇంకెందుకు ఆలస్యం… వెంటనే ఈ వీడియో చూసేయండి.
https://www.youtube.com/watch?v=QnzI8_tT6vs