No Sleep : 60 ఏళ్ల నుంచి నిద్ర లేదు.. అన్ని సంవత్సరాలు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు బాబోయ్.. ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

No Sleep : 60 ఏళ్ల నుంచి నిద్ర లేదు.. అన్ని సంవత్సరాలు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు బాబోయ్.. ఎవరో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :1 July 2023,9:00 pm

No Sleep : ఈ వ్యక్తికి 60 ఏళ్ల నుంచి నిద్ర లేదు. అంటే నిద్ర పోలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. 60 ఏళ్ల పాటు నిద్ర పోలేదు. ఒక్క రోజు, రెండు రోజులు నిద్ర పోకుండా ఉంటేనే ఎలాగో అవుతుంది. నిద్ర పోకుంటే అంతా ఎలాగో అవుతుంది. చేతగాదు. అదే ఒక వారం రోజులు వరుసగా నిద్రపోకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. కానీ.. ఈ వ్యక్తి చూడండి.. 60 ఏళ్ల నుంచి నిద్రపోవడం లేదు. షాక్ అయ్యారా? అవును.. 60 ఏళ్ల నుంచి ఆ వ్యక్తి నిద్ర పోలేదు.

అతడు ఒక రైతు. వియత్నాంకు చెందిన 80 ఏళ్ల రైతు థాయ్ ఎన్ గోక్ గురించే మనం మాట్లాడుకునేది. ఆయనకు నిద్రలేమి సమస్య ఉంది. అంటే.. నిద్రకు సంబంధించిన వ్యాధి. దీని వల్ల ఆయనకు నిద్ర అస్సలు రాదు. ఆయన 1942 లో జన్మించాడు. తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంటే 1962లో తీవ్రమైన జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి నిద్ర రావడం లేదట. 1962 నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు నిద్రపోలేదట.

No Sleep : దీన్నే స్లీప్ డిజార్డర్ అంటారు

ఇది కూడా ఒక వ్యాధి లాంటిదే. దీన్నే స్లీప్ డిజార్డర్ అంటారు. కానీ.. ఇది తన ఆరోగ్యంపై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ చూపించడం లేదు. అందుకే 80 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు థాయ్. ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకుతున్నాడు. కానీ.. కనీసం రోజుకు 8 గంటలు అయినా నిద్రపోతేనే కదా మనం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేది. కానీ.. ఈ తాత ఒక్క నిమిషం కూడా నిద్రపోడు. అయినా కూడా ఎందుకు ఆ తాత ఆరోగ్యంగా ఉన్నాడు అనే డౌట్ వస్తోందా. నాకు నిద్ర అవసరం లేదు.. అంటున్నాడు ఆయనే. నిద్రపోకున్నా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్నాడు. తనకు నిద్ర వచ్చేలా ఏం చేసినా కూడా నిద్ర రాదట. అసలు తను నిద్రపోవడం ఇప్పటి వరకు మేము చూడలేదని థాయ్ పక్కింటి వాళ్లు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదేం విచిత్రమో కదా.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది