YSRCP : వైఎస్సార్ సీపీకి ఆ అవసరం ఏమీ లేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : వైఎస్సార్ సీపీకి ఆ అవసరం ఏమీ లేదు

 Authored By prabhas | The Telugu News | Updated on :8 May 2022,7:00 am

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. అప్పుడే హడావుడి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయిన చంద్రబాబు నాయుడు పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కుప్పిగంతులు వేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విషయం జనాలకు అర్థం అయ్యి పక్కకు పెట్టారు. మళ్లీ ఎలా బాబుకు ఓట్లు వేస్తారంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా పార్టీ నాయకుల సమావేశం అయిన ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందిస్తూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాని అది సాధ్యం కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 20 నుండి 25 ఏళ్ల పాటు కొనసాగుతారనే నమ్మకంను వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల కారణంగా మళ్లీ వైకాపా విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.

vijaya sai reddy about ysrcp Alliance with other parties

vijaya sai reddy about ysrcp Alliance with other parties

ఇంకా విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కొన్ని పార్టీలు పొత్తు కోసం ప్రాకులాడుతున్నాయి. సర్కారు ఓటును చీల్చవద్దంటూ పవన్‌ కళ్యాణ్‌ మరియు చంద్రబాబు కలుస్తున్న నేపథ్యంలో వైకాపా కు ఆ అవసరం లేదు అంటూ విజయ సాయి రెడ్డి ప్రకటించాడు. ఎట్టి పరిస్థితుల్లో మరే పార్టీ తో పొత్తు లేకుండా వైకాపా ముందుకు వెళ్తుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. వైకాపా పై జనాల్లో పూర్తి భరోసా ఉంది. కనుక వైకాపా కు మరే పార్టీ తో పొత్తు అవసరం లేకుండానే విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది