Ganta Srinivasa Rao : రాజీనామా విషయంలో తగ్గేదేలే.. గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం? వైజాగ్ లో ఉపఎన్నిక?
Ganta Srinivasa Rao : అప్పుడెప్పుడో సంవత్సరం కిందనే వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరిస్తోందని… దానికి వ్యతిరేకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించారు. కానీ.. అప్పట్లో ఏపీ స్పీకర్ తన రాజీనామాకు ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం తన రాజీనామా అంశాన్ని గంటా శ్రీనివాస రావు మరోసారి తెరమీదికి తీసుకొచ్చారు. సంవత్సరం పాటు ఆగిన గంటా మళ్లీ ఎందుకు తన రాజీనామా అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారంటే దానికి ఒక కారణం ఉంది.
ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. కేంద్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తోంది కాబట్టి.. ఆ అంశాన్ని మరోసారి హైలైట్స్ చేసేందుకు తన రాజీనామా అంశం తెర మీదికి వచ్చింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు కూడా గంటాను కలవడంతో మరోసారి తన రాజీనామా అంశం చర్చనీయాంశం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపఎన్నిక అవసరమా? అనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. గంటా రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించడం లేదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే..
Ganta Srinivasa Rao : ప్రభుత్వం రాజీనామాను ఆమోదిస్తే ఉపఎన్నిక అనివార్యం
ఇప్పటికే బద్వేలు, ఆత్మకూరులో ఉపఎన్నికలు జరిగినప్పటికీ.. ఆయా ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల ఉపఎన్నికలు వచ్చాయి. కానీ.. అసలే వైజాగ్. ఓవైపు పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో వైజాగ్ లో ఉపఎన్నిక రావడం అవసరమా? ఒకవేళ అటూ ఇటూ అయితే.. వైసీపీకి అనుకున్నన్ని ఓట్లు రాకపోతే ఎలా? ఒకవేళ టీడీపీ గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందేమో అని వైసీపీ భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం మరి గంట రాజీనామాను ఇప్పటికైనా ఏపీ స్పీకర్ ఆమోదిస్తారా? లేదా?