Ys jagan : వైఎస్ జగన్ విజయాల్లో వాళ్లదే కీలక పాత్ర !
Ys jagan : జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామంలోని చివరి ఇంట దాక చేరాలనే లక్ష్యంతో జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ పట్ల దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించటం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పవచ్చు.
అయితే దీనిపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసిన కానీ సీఎం జగన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా జగన్ కు పార్టీకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో రాజకీయ నేతల పాత్ర ఎంత ఉందొ అంతకంటే ఎక్కువగానే గ్రామా వాలంటీర్లు పాత్ర ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాలంటీర్ పనిచేస్తున్నారు. ఇలా వాలంటీర్ పనితీరు వల్లే వైసీపీకి బాగా ప్లస్ అయింది.
Ys jagan : ఉగాదికి సన్మానం
దీనితో ఈ ఉగాదికి వాలంటీర్లు యొక్క కష్టాన్ని గుర్తిస్తూ వాళ్లకు సన్మానం చేసి మంచి పనితీరు కనబర్చిన వారికి ఉగాది పురస్కారలని కూడా అందజేయనున్నారు. గతంలో వాలంటీర్లు తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేసినప్పుడు, మీరు చేస్తుంది సేవ అలాంటి దానికి మేము గౌరవ వేతనం ఇస్తున్నాం తప్పితే జీతం ఇవ్వటం లేదు. అందుకే దీనికి వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు.. మీ కష్టాన్ని గుర్తించి సన్మానం పురస్కరాలు అందిస్తామని జగన్ చెప్పటం జరిగింది. దానికి తగ్గట్లే ఇప్పుడు ఉగాదికి పురస్కారాలు అందిస్తున్నారు.
మరోపక్క ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా వాలంటీర్లు వ్యవస్థపై విమర్శలు చేస్తూనే ఉంది. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ మొదట నుంచి ఆరోపిస్తుంది. ఇక ఇందులో కాదనలేని వాస్తవం కూడా ఉందనే విషయం తెలిసిందే. అలాగే వాలంటీర్లు ఎన్నికల సమయంలో ప్రజలని బెదిరించి వైసీపీ కార్యకర్తలకు ఓట్లు వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని వాలంటీర్లు బహిరంగంగానే బెదిరించరాని చెబుతూ, టీడీపీ పలు వీడియోలని సోషల్ మీడియాలో కూడా పెట్టింది. ఓ రకంగా చెప్పాలంటే వాలంటీర్లు వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తూనే ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ వ్యవస్థలో భాగమే…