బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ సెట్ రైట్ అయ్యారా? అందుకేనా ఈ మార్పు?
ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క.. అన్నట్టుగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం. అవును.. మొన్నటి వరకు అంటే దుబ్బాక ఉపఎన్నిక వరకు కూడా అస్సలు సీఎం కేసీఆర్ పెద్దగా టెన్షన్ పడలేదు. తెలంగాణ మొత్తం తనవైపే ఉందనుకున్నారు. కానీ.. దుబ్బాక ఉపఎన్నక, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. రెండూ సీఎం కేసీఆర్ కు అసలు పరిస్థితిని వివరించాయి. అందులోనూ మొదటి నుంచి బండి సంజయ్ దూకుడుతో వ్యవహరించడం.. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను విమర్శించడంలో సక్సెస్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ చాలా సార్లు సవాల్ విసిరారు. బహిరంగంగానే కేసీఆర్ ను విమర్శించారు. దుబ్బాకలో గెలిచి తీరుతామన్నారు.. గెలిచి చూపించారు. అలాగే 2023 ఎన్నికల్లోనూ బీజేపీ విజయభావుట ఎగురవేస్తుందని నొక్కి చెబుతున్నారు బండి సంజయ్.
దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. అందుకే.. ప్రస్తుతం చాలా యాక్టివ్ అయ్యారు. పార్టీకి సంబంధించినవే కాకుండా.. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ దృష్టి కేంద్రీకరించారు. కొన్ని సంక్షేమ పథకాలు తప్పుదారి పడుతున్నాయని కేసీఆర్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయి.. దానిపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం కోసం ప్రత్యేక కమిటీ వేయనున్నట్టు తెలుస్తోంది.
అసలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయం తెలుసుకోవడం కోసం కమిటీని వేయడంతో పాటు.. తను కూడా ఆరా తీస్తున్నారట. ఇలా.. సీఎం కేసీఆర్ చేస్తున్న పనులన్నీ ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.
అన్ని సంక్షేమ కార్యక్రమాలపై ఆరా?
ఇలా ఒక్క పథకం కాదు.. చాలా పథకాల నిర్వహణ గురించి కేసీఆర్ తెలుసుకుంటున్నారట. కేసీఆర్ మాత్రమే కాదు.. కేటీఆర్ కూడా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారట. మొత్తానికి బండి సంజయ్ వల్ల కేసీఆర్, కేటీఆర్.. ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మళ్లీ పార్టీని గాడిలో పెట్టడం కోసం.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో వినికిడి.