TRS : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ… అడ్డంగా ఇరుక్కున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ… అడ్డంగా ఇరుక్కున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 April 2021,7:00 am

TRS : సాగర్ ఉపఎన్నిక పోరు ముగిసింది. ఇక పురపాలక పోరుకు తెర లేచింది. వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు… మరో ఐదు మునిసిపాలిటీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ముఖ్యంగా వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. టీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్ టీఆర్ఎస్ నేతలు అడ్డంగా ఓ వివాదంలో ఇరుక్కుపోయారు. ఓవైపు త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఈ సమయంలో వాళ్లు అడ్డంగా ఇరుక్కుపోవడం టీఆర్ఎస్ పార్టీలో కలకలం లేపింది.

warangal trs mlas in trouble ahead of municipal corporation elections

warangal trs mlas in trouble ahead of municipal corporation elections

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కార్యకర్తలమంటూ కొందరు ఒక కరపత్రాన్ని బహిరంగపరిచారు. అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. అయితే… ఈ కరపత్రాన్ని ఎవరు విడుదల చేశారో తెలియనప్పటికీ.. అది మాత్రం ప్రస్తుతం వరంగల్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తెగ హల్ చల్ చేస్తోంది.

TRS : ఒక్క టికెట్ కు 30 నుంచి 50 లక్షలు

ప్రతి డివిజన్ వారీగా అభ్యర్థుల ఎంక్వైరీ చేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకే టికెట్లు ఇస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు కానీ.. బయట మాత్రం పరిస్థితి వేరు విధంగా ఉంది. కార్పొరేటర్ టికెట్ కావాలంటే… అభ్యర్థులు 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు డబ్బులు చెల్లించాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అసలు… మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లకు టికెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ మాలో ఎక్కువైంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, మంచి పేరున్న వాళ్లకు కాకుండా… రౌడీ షీటర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లను ఇస్తున్నారు. మంత్రి కేటీఆర్ మాత్రం మంచి పేరున్న వారికి, పార్టీ కోసం పనిచేసే వారికి అన్ని విధాలుగా సర్వే చేయించి, సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు ఇస్తామన్నారు కానీ…. ఇక్కడ మాత్రం పరిస్థితి అలా లేదు. మా ఈ కరపత్రం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ కు గానీ… సీఎం కేసీఆర్ కు గానీ చేరేలా చూడగలరని… టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆవేదన.. అంటూ ఆ కరపత్రంలో రాసి ఉంది. మరి… దీనిపై టీఆర్ఎస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

warangal trs mlas in trouble ahead of municipal corporation elections

warangal trs mlas in trouble ahead of municipal corporation elections

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది