Washing Machine : రూ.800కే వాషింగ్ మెషిన్.. దీనికి సంబంధించిన విశేషాలు తెలిస్తే ఆశ్చ్యపోతారు..!
Washing Machine: తక్కువ సమయంలో దుస్తులను శుభ్రం చేసుకునేందుకు వాషింగ్ మెషిన్‌లను వాడతాం. అంతేకాక చేత్తో దుస్తులను ఉతకాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. అయితే మంచి వాషింగ్ మెషిన్ కొనాలంటే రూ.15 వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేయాలి. కానీ అందరూ అంత డబ్బు వెచ్చించి వాషింగ్ మెషిన్ కొనలేరు.అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ప్రస్తుతం వాషింగ్ మెషీన్లలోనూ ఎన్నో రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
తక్కువ ధరకే దొరుకుతున్నాయి. పోర్టబుల్ వాషింగ్ మెషిన్‌లు కూడా మనకు లభిస్తున్నాయి. ఇలాంటి వాషింగ్ మెషిన్‌లను చిన్న డబ్బాలో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాప్‌టాప్ బ్యాగుల్లో వీటిని పెట్టుకుని ఊరికి వెళ్లిపోవచ్చు.ఈ పోర్టబుల్ వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడాలంటే ముందుగా బకెట్‌లో నీళ్లు పోసి అడుగు భాగంలో వాషింగ్ మెషీన్ ఉంచాలి. లేదంటే బకెట్ గోడలకైనా అట్టిపెట్టవచ్చు. ఆ తర్వాత బట్టలు, డిటర్జెండ్ పౌడర్ లేదా లిక్విడ్ వేయాలి.అంతే మెషీన్ స్విచ్ ఆన్ చేస్తే ఈ మిషన్ గిర్రున తిరుగుతూ బట్టలను వాష్ చేసేస్తుంది.
Washing Machine : ఇది ఇలా పనిచేస్తుంది..
ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ అటూ ఇటూ తిరుగుతూ బట్టలను కూడా పులుముతుంది. బట్టలలో ఉండే మురికి వదిలేలా పిండుతుంది. ఈ వాషింగ్ మెషీన్‌ను బకెట్ గోడలకు కూడా అతికించవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. కంపెనీని బట్టి రూ.800 నుంచి 1500 వరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ పోర్టబుల్ వాషింగ్ మెషిన్‌తో జీన్స్ వంటి మందపాటి బట్టలను వాష్ చేయలేం.