Viral video : సైకిల్ పెడల్ తో వాషింగ్ మిషన్… ఏంటి భయ్యా ఇలా కూడా వాడేస్తారా.. వైరల్ వీడియో ?
Viral video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తోంది. అంతేకాక నేటి కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో దీన్ని ఉపయోగించుకొని చాలామంది సెలబ్రిటీలు గా మారారు. మరికొందరు ఈ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వారితో పాటు ఫన్నీ ఫన్నీగా వీడియోలు చేస్తూ సంపాదించేవారు […]
ప్రధానాంశాలు:
Viral video : సైకిల్ పెడల్ తో వాషింగ్ మిషన్... ఏంటి భయ్యా ఇలా కూడా వాడేస్తారా.. వైరల్ వీడియో ?
Viral video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తోంది. అంతేకాక నేటి కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో దీన్ని ఉపయోగించుకొని చాలామంది సెలబ్రిటీలు గా మారారు. మరికొందరు ఈ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వారితో పాటు ఫన్నీ ఫన్నీగా వీడియోలు చేస్తూ సంపాదించేవారు కూడా ఉన్నారు. అలాంటి ఫన్నీ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటిదే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.
Viral video : సైకిల్ పెడల్ తో వాషింగ్ మిషన్…
అయితే ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ అనేది ఎంత ఉపయోగకరమైన వస్తువో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో చాలామంది ఈ వాషింగ్ మిషన్ ఉపయోగించి వారి పనులను సులభతరం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వాషింగ్ మిషన్ ను తాజాగా ఓ వీడియోలో చాలా వింతగా చూపించారు. ఈ వీడియో చూసిన్నట్లయితే ఒక ప్లాస్టిక్ టబ్ లో నీళ్లు పోసి దానిలో బట్టలు వేసి దానిపై సైకిల్ ను పడుకోపెట్టారు. ఇక ఆ సైకిల్ పెడల్ కచ్చితంగా వాటర్ టబ్ లో ఉండే విధంగా చూశారు. ఇక దాంట్లో సర్ఫు వేసి పెడల తిప్పుతూ ఉంటే బట్టలు తిరుగుతూ ఉన్నాయి. వాషింగ్ మిషన్ మాదిరిగా నీటి లోపల ఉన్న బట్టలను సైకిల్ పెడల్ తో ఓ మహిళ తిప్పుతూ ఉంది. ఇంకేముంది వాషింగ్ మిషన్ తయారైనట్లే.
ఈ విధంగా వాషింగ్ మిషన్ ను తయారు చేసి బట్టలు ఉతుకుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చోటా న్యూస్ అనే ఛానల్ వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ…మా అమ్మ వాషింగ్ మిషన్ కొనాలని ఎప్పటినుండో అడుగుతుంది..మా ఇంట్లో కూడా సైకిల్ ఖాళీగా ఉంది వెంటనే మా అమ్మకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ క్యాప్షన్ రాస్కొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు మా ఇంట్లో కూడా సైకిల్స్ ఖాళీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మేము కూడా వెంటనే మా ఇంట్లో మహిళలకు శుభవార్త చెబుతామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మా అమ్మ వాషింగ్ మేషిన్ కొందామని రోజు ఎప్పటినుండో అడుగుతాంది మా ఇంట్లో కూడా సైకిల్ ఉంది వెంటనే మా అమ్మకి ఈ గుడ్ న్యూస్ చెప్పాలి ????????????#crazyvideos #amma #CycleX #momlife #mother #chotanews pic.twitter.com/xC7ZecxUkv
— ChotaNews (@ChotaNewsTelugu) May 3, 2024